ఆంధ్రప్రదేశ్‌

కమలంలో తిరుగుబాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 6: నవ్యాంధ్ర రాజధాని నగర కమిటీ అధ్యక్షుడిని సస్పెండ్ చేస్తూ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు తీసుకున్న నిర్ణయంపై ఆ పార్టీలో అగ్గి రాజుకుంది. రాష్ట్ర అధ్యక్షుడి నిర్ణయాన్ని సవాల్ చేస్తూ విజయవాడ నగర శాఖ కార్యవర్గం, మెజారిటీ పార్టీ డివిజన్ అధ్యక్షులు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు ఫిర్యాదు చేయడం, ఆ అధికారం రాష్ట్ర అధ్యక్షుడికి లేదని దళితమోర్చా మీడియాకెక్కడంతో సస్పెన్షన్ వ్యవహారం కొత్త మలుపు తిరిగినట్టయింది.
జాతీయ నాయకత్వ నిర్లిప్త ధోరణి, సాగతీత వైఖరి రాష్ట్రంలో పార్టీని నష్టపరిచేదిశలో సాగుతోంది. రాష్ట్ర బిజెపి చరిత్రలో తొలిసారి సొంత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిపైనే తిరుగుబాటు చేసిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. విజయవాడ పార్టీ నగర అధ్యక్షుడు, బీసీ వర్గానికి చెందిన ఉమామహేశ్వరరాజుపై రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు వేసిన సస్పెన్షన్ వేటు చెల్లదంటూ 59మంది డివిజన్ అధ్యక్షుల్లో 43మంది, నగర పార్టీ కార్యవర్గం తీర్మానం చేసి, దానిని జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు ఫిర్యాదు చేశారు.
తాము ఆయనను ఎన్నుకున్నందున, రాష్ట్ర అధ్యక్షుడికి తమ నగర అధ్యక్షుడిని సస్పెండ్ చేసే అధికారం లేదని, రాజుపై విధించిన సస్పెన్షన్‌ను తొలగించాలని, పార్టీకి చిత్తశుద్ధి అంకితభావంతో పనిచేసే నాయకులను ఒక వ్యూహం ప్రకారం తొలగించడం బాధాకరమని షాకు పంపిన లేఖలో పేర్కొన్నారు. ఈ పరిణామాలతో రాష్ట్ర నాయకత్వం ఇరుకున పడినట్టయింది.
ఇప్పటికే రాష్ట్ర పార్టీలో కులతత్వం బాగా ముదిరిపోయిందని, అన్య కులాలను ఎదగనిచ్చే పరిస్థితి లేకుండా పోయిందన్న ఆరోపణలు కిందిస్థాయి వరకూ చేరాయి. తాజాగా సోషల్ మీడియాలో ఏపి బిజెపిలో ఒక కులం సాగిస్తోన్న పెత్తనానికి సంబంధించి ‘ఇతర కులాలకు ప్రవేశం లేదని బోర్డులు పెట్టుకోండ’ని వచ్చిన కథనం హల్‌చల్ చేస్తోంది. బీసీ వర్గానికి చెందిన నగర అధ్యక్షుడు డాక్టర్ రాజును హరిబాబు సస్పెండ్ చేయడం, దానికి ఆయన వర్గానికి చెందిన జమ్ముల శ్యాంకిశోర్ కారణమని బీసీ, ఎస్సీలు బహిరంగంగా ఆరోపణలు గుప్పించడంతో.. పార్టీలో దశాబ్దాల నుంచి కొనసాగుతూ, మీడియా దృష్టికి రాని కులతత్వం బట్టబయలయినట్టయింది.
ఇది చాలదన్నట్లు బెజవాడ దళితమోర్చా నేత యలమంచలి శ్రీనివాస్ పార్టీలో సాగుతున్న కులతత్వం, వర్గపెత్తనంపై బహిరంగంగానే తిరుగుబాటు చేయటం సంచలనం సృష్టించింది. సస్పెన్షన్‌కు జమ్ముల, దిలీప్ కారకులని, పదవీకాలం పూర్తయిన రాష్ట్ర అధ్యక్షుడికి సస్పెండ్ చేసే హక్కు లేదని స్పష్టం చేశారు. హరిబాబును తొలగించి, కొత్త అధ్యక్షుడిని నియమించాలని, లేకపోతే రాష్ట్రంలో పార్టీ మనుగడ కష్టమని ఆందోళన వ్యక్తం చేశారు.
‘ఇప్పటికే పార్టీలో ఒక కులానికి, మిగిలిన కులాలకు మధ్య వార్ జరుగుతోందని ఢిల్లీకి తెలుసు. ఇప్పుడు బీసీని సస్పెండ్ చేశారు. రేపు ఇంకో దళితుడిని చేస్తారు. అందుకే అందరూ కలసి తిరుగుబాటు చేసినట్లు కనిపిస్తోంది. ఇది కూడా ఒకందుకు మంచిదే. రాష్ట్రంలో ఏం జరుగుతుందో మా వాళ్లకు తెలుస్తుంది. రాష్ట్ర అధ్యక్షుడిపై ఒక నిర్ణయం తీసుకుంటే ఈ దుస్థితి వచ్చేది కాదు కదా? వాళ్లకు రాష్ట్రంలో పార్టీ బలపడాలనుకుంటే మార్పు చేస్తారు. తెదేపా బలంగా ఉండాలనుకుంటే ఇలాగే కొనసాగిస్తార’ని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. ఇప్పటికే పార్టీకి బడుగు బలహీన వర్గాలు దూరమవుతున్నారన్న ఆందోళన పార్టీ నాయకత్వంలో ఉంది. ఒకవైపు ఆయా వర్గాలను దరిచేర్చుకునేందుకు భారీ కార్యక్రమాలు రూపొందిస్తుంటే, మరోవైపు అదే వర్గాలకు చెందిన వారిని తొలగిస్తూ, అణచివేతకు గురిచేస్తున్నారన్న సంకేతాలు పార్టీకి నష్టం కలిగిస్తాయని పార్టీ సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.