ఆంధ్రప్రదేశ్‌

డిటిసి ఇళ్లలో ఏసిబి సోదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు/నెల్లూరు , అక్టోబర్ 6:ప్రకాశం జిల్లా ఇన్‌చార్జి డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ కె రాంప్రసాద్ ఇంటిపై అతని బంధువుల ఇళ్ళపై గురువారం ఉదయం నుంచి ఏకకాలంలో అవినీతి నిరోధకశాఖాధికారులు ముమ్మరంగా దాడులు నిర్వహించారు. రాంప్రసాద్ సొంత ఇళ్ళపైనే కాకుండా ఒంగోలు, వినుకొండ, నెల్లూరులో ఉన్న ఆయన బంధువుల ఇళ్ళపైన, ఒంగోలులోని ఆర్‌టిఒ కార్యాలయంలోను సోదాలు నిర్వహించి కీలకమైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఒంగోలు, బెంగళూరు, తెనాలి, విశాఖపట్నం, అమరావతి, నెల్లూరు ప్రాంతాల్లో ఎసిబి అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించి కీలకమైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. వాటివిలువ సుమారు రెండున్నర కోట్ల రూపాయలు ఉంటుందని ఎసిబి అధికారులు ప్రాథమికంగా అంచనావేశారు. అయితే దర్యాప్తు అనంతరం వీటి విలువ మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒంగోలులోని ఆర్‌టిఒ కార్యాలయంలోను ఎసిబి అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేయటంతో కార్యాలయ సిబ్బంది ఆందోళన చెందారు. అమరావతిలో పొలం, విశాఖపట్నంలో ఒక ప్లాటు ఉన్నట్లు ఎసిబి అధికారులు గుర్తించారు. ఈ దాడుల్లో నెల్లూరు ఎసిబి డిఎస్‌పి ప్రభాకర్, ఒంగోలు సిఐ ప్రతాప్‌కుమార్, ఎస్‌ఐ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. రవాణాశాఖమంత్రి శిద్దా రాఘవరావు సొంత జిల్లాకేంద్రమైన ఒంగోలులో ఆర్‌టిఒ కార్యాలయంపై ఎసిబి అధికారులు దాడులు చేయటం పట్ల సర్వత్రా చర్చనీయాంశమైంది. రాంప్రసాదు తన కుమార్తె రేడియాలజి సీటుకోసం ఒకటిన్నర కోటిరూపాయలు ఒక మెడికల్ కాలేజికి చెల్లించినట్లు కూడా ఎసిబి అధికారులు గుర్తించినట్లు సమాచారం. ప్రసాద్ సమీప బంధువు వరకుమార్ ప్రస్తుతం నెల్లూరు ఉప రవాణా కమిషనర్ కార్యాలయంలో పరిపాలనాధకారిగా పనిచేస్తుండడం గమనార్హం.