ఆంధ్రప్రదేశ్‌

కర్నూలు పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, అక్టోబర్ 8: కర్నూలు నగర శివారులోని అనుటెక్ గ్లిజరిన్ పరిశ్రమలో శనివారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కూలింగ్ రియాక్టర్‌లో రసాయన పదార్థం లీక్‌కావడంతో ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఆస్తినష్టం భారీగా ఉంటుందని భావిస్తున్నారు. తుంగభద్రనది ఆవలి ఒడ్డున ఉన్న అనుటెక్ గ్లిజరిన్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం సంభవించడంతో మంటలు ఎగిసిపడ్డాయి. నల్లటి దట్టమైన పొగ వ్యాపించింది. నగరానికి అతి సమీపంలో ఈ పరిశ్రమ ఉండడంతో మంటలు, దట్టమైన పొగ అలముకుంది.