ఆంధ్రప్రదేశ్‌

రాజయ్య దీక్ష భగ్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, అక్టోబర్ 8: భద్రాచలం జిల్లా కోసం, వాజేడు, వెంకటాపురం మండలాలను తిరిగి భద్రాచలం నియోజకవర్గంలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా భద్రాచలంలో ఎమ్మెల్యే సున్నం రాజయ్య, తెదేపా నియోజకవర్గ ఇంచార్జ్ కొమరం ఫణీశ్వరమ్మ నిర్వహిస్తున్న ఆమరణ నిరాహార దీక్షలను పోలీసులు శనివారం తెల్లవారుఝామున భగ్నం చేశారు. సిఐ బాణాల శ్రీనివాసులు, ట్రాఫిక్ ఎస్సై అబ్బయ్య ఆధ్వర్యంలో పోలీసులు, మహిళా పోలీసులు సంయుక్తంగా ఏకకాలంలో రెండు శిబిరాల వద్దకు చేరుకుని వారిని బలవంతంగా అంబులెన్స్‌లు ఎక్కించారు. భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఆరోగ్య పరిస్థితి విషమించడం, సుగర్ లెవెల్స్ తగ్గిపోవడంతో శుక్రవారం రాత్రి పోలీసులు, అధికారులు ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ దీక్ష విరమణకు ఆయన ససేమిరా అన్నారు. దీంతో అధికారులు వెనుదిరిగారు. ఆందోళనకారులు, పార్టీ శ్రేణులు నిద్రపోతున్న సమయంలో పోలీసులు మెరుపు వేగంతో శిబిరాల వద్దకు చేరుకుని సున్నం రాజయ్యను, ఫణీశ్వరమ్మను భద్రాచలం ఏరియా ఆసుప్రతికి క్షణాల్లో తీసుకెళ్లారు. అయితే తెలుగుదేశం నియోజకవర్గ ఇంఛార్జ్ కొమరం ఫణీశ్వరమ్మ ఆసుపత్రిలో చికిత్స చేయించుకునేందుకు నిరాకరించారు. వైద్యులకు సహకరించకుండా ఆసుపత్రిలోనే ఆమె దీక్ష కొనసాగించారు. పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేయగా తెలంగాణ రాప్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రమణ వెంటనే కొత్తగూడెం ఇంఛార్జ్ కోనేరు సత్యనారాయణ(చిన్ని) ద్వారా ఏరియా ఆసుపత్రికి సందేశం పంపించారు. పంతం మానుకోవాలని, మీ ప్రాణాలకు పార్టీకి ముఖ్యమని, ఈ సమస్యపై రాష్ట్ర పార్టీ కూడా పోరాడుతుందని హామీని ఆమెకు పంపించారు. కోనేరు సత్యనారాయణ(చిన్ని) నిమ్మరసం ఇచ్చి ఆసుపత్రిలో దీక్ష చేస్తున్న ఫణీశ్వరమ్మ దీక్షను విరమింపజేశారు. తెలంగాణ సర్కారు ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా పనిచేస్తోందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సున్నం రాజయ్య, కొమరం ఫణీశ్వరమ్మలు ధ్వజమెత్తారు. దీక్షను భగ్నం చేసినంత మాత్రాన ఉద్యమం ఆగదని, కొనసాగుతుందని ప్రభుత్వాన్ని వారు హెచ్చరించారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే సున్నం