ఆంధ్రప్రదేశ్‌

మాకు న్యాయం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు/ఒంగోలు/చిత్తూరు, అక్టోబర్ 8: నెల్లూరు ,చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ఆగ్రిగోల్డ్ బాధితులు ఆందోళన బాట పట్టారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ నెల్లూరు శివారున జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. తాము ఎంతో కష్టపడి కూడబెట్టుకున్న సొమ్మును అగ్రిగోల్డ్ యాజమాన్యం దోచేసిందని ఆరోపించారు. యాజమాన్యాన్ని కాపాడాలని కొందరు ప్రభుత్వంలోని పెద్దలు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని తన నగదును ఇప్పించాలని, లేనిపక్షంలో తమకు ఆత్మహత్యలు తప్ప వేరే మార్గం లేదని స్పష్టం చేశారు. కాగా అగ్రిగోల్డ్ బాధితుల ఆందోళననకు నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్ మద్దతు తెలిపారు. కాగా ఒంగోలులో ఆందోళన చేస్తున్న అగ్రిగోల్డ్ కస్టమర్లు, ఏజెంట్లు, నాయకులను పోలీసులు అరెస్టుచేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అగ్రిగోల్డ్ కస్టమర్స్, అండ్ ఏజెంట్స్ వెల్పేర్ అసోసియేషన్ రాష్టక్రమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఒంగోలు నగరంలోని సంఘమిత్ర వైద్యశాల వద్ద ఉన్న జాతీయ రహదారిపై రాస్తారాకో చేసేందుకు ప్రయత్నించిన అగ్రిగోల్డ్ బాధితులు, ఏజెంట్లు, అసోసియేషన్ నాయకులను ఒంగోలుపోలీసులు అరెస్టుచేసి జిల్లాలోని వివిధ పోలీసుస్టేషన్లకు శనివారం తరలించారు. సంఘమిత్ర వైద్యశాల వద్ద ఉన్న జాతీయ రహదారిపై రాస్తారాకో చేసేందుకు వచ్చిన అగ్రిగోల్డ్ కస్టమర్లు, ఏజెంట్లు, అసోసియేషన్ నాయకులను రాస్తారోకో చేయకుండా ఒంగోలు పట్టణ డిఎస్‌పి జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు బాధితులు, నాయకులు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా డిఎస్‌పి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఒంగోలు పట్టణంలో 144సెక్షన్ అమలులో ఉన్నందువల్ల ఆందోళన చేస్తున్న వారిని అదుపులోకి తీసుకుని వదిలేశామన్నారు. కాగా తిరుపతిలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆగ్రిగోల్డ్ బాధితులు ఆందోళన చేశారు. తిరుపతి పూర్ణకుంభం సర్కిల్‌లో నివారం స్థానిక పూర్ణకుంభం సర్కిల్‌లో అగ్రి గోల్డ్‌బాధితుల సంఘం నాయకులు రాస్తారోకో చేస్తూ ఆందోళనకు దిగారు. వీరికి అన్ని పార్టీల మద్దతులభించింది.
chitrm....
తిరుపతిలో అగ్రిగోల్డ్ బాధితుల రాస్తారోకో