ఆంధ్రప్రదేశ్‌

నందివాహనంపై ఆదిదంపతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, అక్టోబర్ 8: శ్రీశైలం మహాక్షేత్రంలో జరుగుతున్న శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా ఎనిమిదవ రోజు శనివారం భ్రమరాంబిక అమ్మవారు శ్రీ మహాగౌరి అలంకారంలో దర్శనమిచ్చారు. స్వామి అమ్మవార్లకు నందివాహన సేవ నిర్వహించారు. అమ్మవారు, స్వామికి ఉదయం ప్రత్యేక పూజలు నిర్వసించారు. అమ్మవారికి మహాగౌరి అలంకారం, స్వామిని నందివాహనంపై ఆశీనులను చేశారు. దేవి నవరూపాల్లో ఎనిమిదో రూపమైన శ్రీమహాగౌరి అలంకారంలో అమ్మవారు ఎర్రని వస్త్రాలు ధరించి అత్యంత శాంతమూర్తిగా తెల్లని వాహనంపై దర్శనమిచ్చారు. 8 చేతులతో ఉన్న అమ్మవారు కుడివైపు చక్రం, గద, ధనుస్సు, బాణం, త్రిశూలాన్ని, ఎడమవైపు శంఖు, పద్మం, ఖడ్గం, రిక్తహస్తంతో ఉంటుంది. ఈ రూపంలోనే ఆదిశక్తి మహిషాసురున్ని సంహరించి లోకకల్యాణాన్ని గావించినట్లు స్కంధపురాణం చెబుతోంది. అంతేగాక పార్వతీదేవి రూపంలో శివున్ని భర్తగా పొందేందుకు కఠోర తపస్సు చేయడంతో శరీరం నల్లబడుతుంది. తపస్సుకు ప్రసన్నుడైన శివుడు ఆమెపై గంగాజలాన్ని చిలకరిస్తాడు. అప్పుడు తేజోవంతమైన గౌరువర్ణంతో అలరారుతుంది. కనుకనే మహాగౌరి అని కూడా పిలుస్తారు. దేవిని పూజించడం వల్ల సకల పాపాలు తొలగి సుఖసౌఖ్యాలు లభిస్తాయి.స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకరణ మండపంలో ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. మహాగౌరి అలంకారంలో ఉన్న అమ్మవారు, నందివాహనంపై ఆశీనులైన ఆది దంపతులకు ధూపదీప నైవేద్యాలతో మంగళహారతులు ఇచ్చి వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ గ్రామోత్సవానికి తోడ్కొని వచ్చారు. భక్తులు భక్తిశ్రద్ధలతో వింజామరలు విసరగా ఛత్రచామర్ల నడుమ డప్పు వాయిద్యాలు, కోలాటాలతో స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం ఆలయ పురవీధుల్లో వైభవంగా నిర్వహించారు. ఈ విశేష కార్యక్రమంలో దేవస్థానం వారు ఏర్పాటు చేసిన కళాకారుల విన్యాసాలు, డప్పు వాయిద్యాలు, గొరవయ్య నృత్యాలు, కోలాటాలు, పుట్టబొమ్మలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. గ్రామోత్సవం పురవీధుల్లోకి రాగానే భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని నారీకేళాలు సమర్పించి, కర్పూర హారతులతో నీరాజనాలు పలికారు. ఈ విశేష కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి నారాయణ భరత్ గుప్త దంపతులు, జెఇఓ హరినాథరెడ్డి దంపతులు, ఆలయ ఎఇఓలు, అర్చకులు, వేదపండితులు పాల్గొన్నారు.
chitram...
శ్రీశైలంలో నందివాహనంపై ఊరేగుతున్న ఆది దంపతులు * మహాగౌరిగా దర్శనమిచ్చిన భ్రమరాంబ