ఆంధ్రప్రదేశ్‌

రూ.కోటి కరెన్సీతో ధనలక్ష్మి అలంకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాలకొల్లు, అక్టోబర్ 8: పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు ఆర్యవైశ్య కల్యాణ మండపంలో దేవీ నవరాత్రి సందర్భంగా శనివారం అమ్మవారిని కోటి రూపాయల కరెన్సీ నోట్లతో ధనలక్ష్మిదేవిగా అలంకరించారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన వేలాది భక్తులతో వీధి కిక్కిరిసింది. ముఖ్యంగా మహిళా భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చారు. చుట్టూ దశావతారాలు, వేదికపై అమ్మవారి విగ్రహాలు ప్రతిష్ఠించి పైనా కింద వివిధ రకాల పుష్పాలుగా కరెన్సీ నోట్లతో తీర్చిదిద్దిన అలంకరణ అలరించింది. ఆలయ కమిటీ అధ్యక్షులు తటవర్తి కృష్ణమూర్తి, కార్యదర్శి మామిడి బాబు నేతృత్వంలో కమిటీ సభ్యుల పర్యవేక్షణలో ఏర్పాట్లు చేశారు. దర్శనానికి వచ్చిన భక్తులందరికీ ప్రసాద వితరణ చేశారు.
chitram...
ధనలక్ష్మీదేవి అలంకారంలో కన్యాకపరమేశ్వరి.. పూల మాలగా కోటి రూపాయల కరెన్సీ నోట్లు