ఆంధ్రప్రదేశ్‌

సిద్ధిదాయినిగా భ్రామరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, అక్టోబర్ 9: శ్రీశైలంలో జరుగుతున్న శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా 9వ రోజైన ఆదివారం అమ్మవారు సిద్ధిదాయి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారు, అమ్మవారికి హంసవాహన సేవ నిర్వహించారు. ఉదయం అమ్మవారికి శ్రీచక్ర నవావరణార్చనలు, స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, రుద్రహోమం, రుద్రయాగాంగ జపాలు, పారాయణాలు ఆలయ అర్చక వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. నవదుర్గలలో చివరి రూపమైన సిద్ధిదాయిని చతుర్భుజాలు కలిగి ఉండి కుడివైపు చక్రం, గద, ఎడమవైపు శంఖు పద్మాలను కలిగి ఉంటుంది. ఈ దేవిని ఉపాసించడం వల్ల 8 సిద్దులను పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి. అమ్మవారిని పూజించడం వల్ల కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. సిద్ధిదాయిని అమ్మవారు, శ్రీ మల్లికార్జున స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను అందంగా అలంకరించి హంసవాహనంపై ఆశీనులను జేసి అక్కమహాదేవి అలంకరణ మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షం కారణంగా రాత్రి జరగాల్సిన గ్రామోత్సవం రద్దయింది. దీంతో అక్కమహాదేవి మండలంలోనే హంసవాహనంపై ఆశీనులైన స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలను ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి సోమవారం సమర్పిస్తారు.

చిత్రం.. మల్లన్నకు హంసవాహన సేవ