ఆంధ్రప్రదేశ్‌

మన ఇస్రోకి సాటి లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలోనే మన శాస్తవ్రేత్తలు మేటి
ప్రతి వర్శిటీ ఓ పరిశోధన కేంద్రం కావాలి సగటు మనిషికి సాంకేతికత అందాలి
ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు ఘనంగా అంతరిక్ష వారోత్సవాల ముగింపు

విశాఖపట్నం, అక్టోబర్ 10: భారతదేశ శాస్తవ్రేత్తలు ప్రపంచంలో ఎవరితోనూ తీసిపోరని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. మానవాళికి దైనందిన జీవితంలో అవసరమయ్యే సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తూ, అంతరిక్ష పరిశోధనల్లో అగ్ర దేశాలకు దీటుగా దూసుకుపోతున్న ఇస్రో శాస్తవ్రేత్తలే ఇందుకు నిదర్శనమన్నారు. మూడు రోజులుగా విశాఖలో నిర్వహిస్తున్న ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల ముగింపు సభ సోమవారం ఆంధ్రా యూనివర్శిటీలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చంద్రబాబు మాట్లాడుతూ ప్రపంచ దేశాలతో పోల్చి చూస్తే భారతదేశం సాంకేతిక వినియోగంలో ఒక అడుగు ముందుందని అన్నారు. గతంలో ఇస్రో అంతరిక్ష పరిశోధనలకే పరిమితమైందని, ఇప్పుడు ప్రజా ప్రయోజనాలకు, దేశ భద్రత కోసం పలు ప్రయోగాలు చేసి, విజయం సాధించిందని అన్నారు. ఇస్రో వద్ద 200 ట్రాన్స్‌పోండర్స్ ఉన్నాయని, వీటిని వినియోగించుకుని, గ్రామాల్లో 280 రకాల ఆస్తులను ట్యాగ్ చేయాలని నిర్ణయించామని చంద్రబాబు చెప్పారు. భూసార పరీక్షలు, పర్యావరణ పరిస్థితులు, దట్టమైన అడవుల్లో అగ్ని జ్వాలలు చెలరేగే ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టే సాంకేతిక ప్రగతి ఇస్రో ప్రతిభకు తార్కాణాలని ని ఆయన చెప్పారు.
విద్యార్థులు తరగతి గదిలో థియరీ నేర్చుకుని, క్షేత్ర స్థాయిలో ప్రయోగాలు చేస్తే, విద్యార్థుల అద్భుత ఫలితాలను సాధించగలుగుతారని ఆయన చెప్పారు. సృజనాత్మకతకు విద్యార్థులు ప్రాధాన్యమివ్వాలని హితవు చెప్పారు. తమకు వచ్చిన వినూత్నమైన ఆలోచనలను వెంటనే ఆచరణలో పెడితే, అద్భుతాలు సృష్టించవచ్చని ఇందుకు గూగల్ ఉద్యోగులే నిదర్శనమన్నారు. విద్యార్థులకు వచ్చిన కొత్త ఆలోచనలను ఇంక్యుబేషన్ సెంటర్‌కు పంపిస్తామని, అది వాణిజ్యపరంగా పనికొస్తుందంటే స్టార్టప్ విలేజ్‌కు పంపుతామని ఆయన చెప్పారు.
ఇస్రో చైర్మన్ కిరణ్‌కుమార్ మాట్లాడుతూ గతంలో సమాచార వ్యవస్థ అధమంగా ఉండేదనీ, కానీ నేడు అరిచేతిలోనే ప్రపంచం మొత్తాన్ని చూడగలుతున్నామని అన్నారు. ప్రజలకు మేలు చేసే అనేక ప్రయోగాలను ఇస్రో చేసి ప్రపంచ దేశాల సరసన నిలిచిందని అన్నారు. తుపానులు, సునామీల రాకను 48 గంటల ముందుగానే తెలియచేస్తున్నామని అన్నారు. ఎర్త్ అబ్జర్వేషన్, నేవిగేషన్, కమ్యూనికేషన్ రంగాలకు సంబంధించి 38 ఉపగ్రహాలను ప్రయోగించామని ఆయన చెప్పారు. త్వరలోనే పారిశ్రామిక అవసరాలకు సంబంధించి ప్రయోగాలు చేయనున్నామని అన్నారు. గ్లోబల్ మార్కెట్ స్థితిగతులను దీనివలన ఎప్పటికప్పుడు తెలుసుకోగలుతామని చెప్పారు. జనవరి నుంచి చంద్రయాన్ తదుపరి ప్రయోగాలను వేగవంతం చేస్తామని అన్నారు.
షార్ డైరక్టర్ కున్ని కృష్ణన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సాంకేతికతను విరివిగా ఉపయోగించుకుంటోందని అన్నారు. ఇస్రో సాధించిన విజయాలను ప్రజలకు నేరుగా అందించేందుకు ప్రభుత్వం ముందుకు రావడం ముదావహమని అన్నారు.

చిత్రం... ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల ముగింపు సందర్భంగా మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు