ఆంధ్రప్రదేశ్‌

పెరుగుతున్న గోదావరి ఉద్ధృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, అక్టోబర్ 10: తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద గోదావరి వరద ఉద్ధృతి మళ్లీ పెరుగుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద సోమవారం మధ్యాహ్నం 8.7 అడుగులున్న నీటిమట్టం రాత్రికి 9.4 అడుగులకు పెరిగింది. బ్యారేజికివున్న మొత్తం 175 గేట్లను ఒక మీటరు మేర ఎత్తివేశారు. బ్యారేజి నుంచి 3 లక్షల 77 వేల 488 క్యూసెక్కుల వరద జలాలను సముద్రంలోకి వదిలేశారు. ఎగువన భద్రాచలం వద్ద మధ్యాహ్నం 3 గంటలకు 29.5 అడుగుల నీటి మట్టం నమోదు కాగా అది కాస్తా రాత్రి సమయానికి 29.8 అడుగులకు చేరినట్టు సమాచారం. అఖండ గోదావరి ఎగువ ప్రాంతాల్లో కూడా ప్రవాహ ఉద్ధృతి పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజి నుంచి తూర్పు డెల్టాకు 3500 క్యూసెక్కులు, మధ్య డెల్టాకు 2200, పశ్చిమ డెల్టాకు 6000 క్యూసెక్కుల జలాలను విడిచిపెట్టారు.