ఆంధ్రప్రదేశ్‌

అంగరంగ వైభవంగా రథోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, అక్టోబర్ 10: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదవ రోజు సోమవారం ఉదయం 7 గంటలకు శ్రీ స్వామివారు ధారురథంపై తిరుమల మాడ వీధులలో విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. సుమారు లక్ష మందికి పైగా భక్తులు ఈ రథోత్సవంలో పాల్గొని స్వామి, అమ్మవార్లను దర్శించారని అంచనా. మొదట శ్రీదేవి, భూదేవి సమేతుడైన శ్రీ మలయప్ప స్వాములను అర్చకులు వజ్ర ఖచిత స్వర్ణ్భారణాలు, సుగంధ పుష్పమాలలతో అలంకరించి తెల్లవారుఝామున 4.40 నుంచి 5.30 గంటల మధ్య కన్యాలగ్నంలో నాలుగు మాడ వీధులలో ఊరేగుతూ రథ మండపం చేరుకున్నారు. అనంతరం పుణ్యాహవచనం, నవగ్రహదానం లాంటి సంప్రదాయ పూజలను నిర్వహించారు. అక్కడనుంచి స్వామి, అమ్మవార్లను రథంపై వేంచేపు చేయించారు. ఉదయం 7 గంటల ప్రాంతంలో స్వామి, అమ్మవార్లు అధిరోహించిన ధారురథాన్ని భక్తులు గోవిందనామ స్మరణ చేస్తూ ముందుకు లాగారు. సుమారు రెండున్నర గంటలపాటు ఈ రథోత్సవం తిరుమాడ వీధులలో సాగింది. ఈ కార్యక్రమంలో ఆలయ చియ్యంగార్లు, టిటిడి చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి, ఇఓ డాక్టర్ డి సాంబశివరావు, జెఇఓ శ్రీనివాసరాజు, సివి అండ్ ఎస్‌ఓ శ్రీనివాస్, బోర్డు సభ్యులు, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
అశ్వ వాహనంపై గోవిందుడు
సోమవారం రాత్రి 9 గంటలకు శ్రీ మలయప్పస్వామి తిరువీధులలో అశ్వారూఢుడై విహరించారు. స్వామి వారికి రంగనాయకుల మండపంలో విశేషాభరణాలంకృతుడై అశ్వవాహనాన్ని అధిరోహించారు. ఈ ఉత్సవంలో బ్రహ్మరథం ముందువైపు రాగా కోలాటాలు, చెక్క్భజనలు, మంగళవాయిద్యాలు, దేవతామూర్తుల వేషాలు, వేదపండితుల వేదవచనాలు మధ్య శ్రీ మలయప్పస్వామి అశ్వాన్ని అధిరోహించి తిరుమాడ వీధుల్లో విహరించారు. బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన మంగళవారం ఉదయం 6 గంటలకు చక్రస్నానం జరుగుతుంది. రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

chitram...
తిరుమల మాడ వీధుల్లో శ్రీవారి రథోత్సవం