ఆంధ్రప్రదేశ్‌

కల్తీ విత్తనాలపై ముమ్మర సర్వే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, అక్టోబర్ 10: కోస్తా నేలలకు కొత్త వంగడంగా ఈ ఖరీఫ్ నుంచి వ్యవసాయ శాఖ సిఫార్సుచేసిన ఆర్‌పి బయో-226 వరి వంగడంలో కల్తీ ఉదంతంపై వ్యవసాయ శాఖ ముమ్మరంగా సర్వే చేపట్టింది. ఈ విత్తనంలో కల్తీ జరిగిందని ‘ఆంధ్రభూమి’ వెలుగులోకి తెచ్చిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అన్ని కోణాల్లో విచారణ జరుగుతోంది. వ్యవసాయ శాఖ అధికారులు ఆ విత్తనం సాగుచేసిన పొలాలు పరిశీలించి, సంబంధిత రైతుల నుంచి వివరాలు సేకరించి, నివేదిక తయారుచేశారు. ఈ విత్తనం వేసిన చోట్ల దాదాపు 50 శాతం వరకు కల్తీ జరిగినట్టు తేలింది. వ్యవసాయ శాఖ అధికారులు కేళీ వచ్చిన క్షేత్రాలను పరిశీలిస్తూ నివేదిక రూపొందించి ఎపి సీడ్ డవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు పంపించింది. ఈ నివేదిక ఆధారంగా ఎపి సీడ్ డవలప్‌మెంట్ కార్పొరేషన్ క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపిన అనంతరం తుదిగా శాస్తవ్రేత్తల బృందం పర్యటించి నికర నష్టాన్ని తేల్చనున్నట్టు తెలిసింది. ప్రస్తుతం పంట పాలుపోసుకుని, గింజ గట్టిపడే దశలో కంకులన్నీ తాలులేనని గుర్తించడంతో రైతులు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. దాదాపు చివరి దశలో నకిలీ వ్యవహారం బయటపడటంతో రైతుల పెట్టుబడి పూర్తిగా నష్టపోయారు. తమ ప్రమేయం లేకుండా ఒక పంటను పూర్తిస్థాయిలో నష్టపోయినందున ప్రభుత్వం సత్వరం చర్యలు తీసుకుని, పూర్తిస్థాయిలో పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.

రేపటి నుంచి
రొట్టెల పండుగ

నెల్లూరు, అక్టోబర్ 10: ప్రతియేటా నెల్లూరు నగరంలోని బారాషాహిద్ దర్గాలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే రొట్టెల పండుగ బుధవారం నుంచి ఐదు రోజులపాటు జరగనుంది. ప్రభుత్వం ఈ ఏడాది రొట్టెల పండగను రాష్ట్ర పండుగగా ప్రకటించడంతో భారీస్థాయిలో ఏర్పాట్లు చేపట్టారు. ఈసారి పది లక్షల వరకు భక్తులు ఈ పండుగకు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. ’

గోడ కూలి ఇద్దరు దుర్మరణం
పాత ఇల్లు తొలగిస్తుండగా ప్రమాదం

డి గన్నవరం, అక్టోబర్ 10: పాత ఇంటిని తొలగిస్తుండగా గోడ కూలి ఇద్దరు కూలీలు దుర్మరణం చెందారు. తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం మండలం రాజులపాలెం గ్రామం అయినాలవారిపాలెంలో సోమవారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. అయినాలవారిపాలెంకు చెందిన బొక్కా సాహెబ్ చెందిన పాత ఇల్లును తొలగించే పనిచేపట్టారు. ముంగండ గ్రామం ఇటుకుల మెరకకు చెందిన మట్టపర్తి వెంకటేశ్వరరావు (35) నరేంద్రపురం గ్రామం బురుగు గుంటకు చెందిన గుమ్మడి నాగరాజు (37) ఈ పనికి కూలీలుగా వచ్చారు. సోమవారం ఉదయం వారు పనిలో నిమగ్నమైవుండగా ఒక్కసారిగా గోడ కూలిపోయింది. దీనితో వారిద్దరూ శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. వారిద్దరూ శిథిలాల కిందే తుదిశ్వాస విడిచారు. సమాచారం అందుకున్న రావులపాలెం సిఐ పివి రమణ, పి.గన్నవరం ఎస్సై పూడి వీరబాబు హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకుని, మృతదేహాలను వెలికితీయించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నటు సిఐ పివి రమణ తెలిపారు.