ఆంధ్రప్రదేశ్‌

బ్రహ్మోత్సవాలకు భారీ ఆదాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, అక్టోబర్ 12: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు మంగళవారం చక్రస్నానంతో వైభవంగా ముగిశాయని టిటిడి ఇఓ సాంబశివరావు చెప్పారు. ఈ తొమ్మిదిరోజులు శ్రీవారిని దర్శించుకున్న భక్తులు హుండీలో సమర్పించిన కానుల ద్వారా టిటిడికి రికార్డు స్థాయి ఆదాయం వచ్చిందన్నారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది భక్తుల సంఖ్య కూడా పెరిగిందన్నారు. భక్తులకు ఎలాంటి లడ్డూల కొరత రాకుండా పోటు సిబ్బంది రోజుకు 4.5 లక్షల లడ్డూలు తయారు చేశారన్నారు. తొమ్మిది రోజుల్లో 7.99లక్షల మంది స్వామివారిని దర్శనం చేసుకున్నారని, గత ఏడాది కన్నా లక్షా 90వేల మంది ఎక్కువగా వచ్చారన్నారు. హుండీ ద్వారా 22.97కోట్ల రూపాయలు ఆదాయం లభించిందని, నిరుటి కన్నా 5కోట్ల 8లక్షలు అదనంగా ఆదాయం వచ్చిందన్నారు. 33.92లక్షల లడ్లు భక్తులకు విక్రయించామన్నారు.
14 నుంచి ప్రతి శుక్రవారం తిరుమలలో గోపూజ
సనాతన ధర్మంలో గోవుకు విశేష ప్రాధాన్యం ఉందని, కలియుగంలో శ్రీవారు పుట్టలో అవతరించినపుడు గోమాత ప్రతిరోజూ శ్రీవారికి పాలిచ్చి సంరక్షించిందని, ఈ నేపథ్యంలో ఈనెల 14వ తేదీ నుంచి ప్రతి శుక్రవారం తిరుమల శ్రీవారి ఆలయం వద్ద ఊంజల్‌సేవ సమయంలో గోపూజ నిర్వహిస్తామని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి వెల్లడించారు. దేశవాళీ గోవులను సంరక్షించి, వాటిని అభివృద్ధి చేసేందుకు పలమనేరులో అత్యాధునిక వసతులతో గో సంరక్షణశాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.