ఆంధ్రప్రదేశ్‌

పేదలు, రైతులపై దాడులకు ఏం సమాధానం చెబుతారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, అక్టోబర్ 13: పాకిస్తాన్‌పై సర్జికల్ దాడి చేశామని గొప్పలు చెప్పుకుంటున్న కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం తన కూటమి ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాల్లోని పేదలు, రైతులపై జరుగుతున్న దాడులకు ఏం సమాధానం చెబుతుందని సిపిఎం పోలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ ప్రశ్నించారు. ఇటువంటి దాడులను చూస్తూ ఊరుకోమన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో గురువారం జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల బాబు కాదని, కంపెనీల బాబు అని విమర్శించారు. ఈ రాష్ట్రంలోని చట్టాలను ఉల్లంఘిస్తున్నారన్నారు. భీమవరం మండలం తుందుర్రు గ్రామంలో నిర్మితమవుతున్న గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్కుకు అక్కడ ప్రజల అంగీకారం తీసుకోకుండా, కేవలం ఆనందా గ్రూపు కంపెనీ అనుమతుల ప్రకారమే చంద్రబాబు ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు.