ఆంధ్రప్రదేశ్‌

త్వరలో నామినేటెడ్ పదవుల భర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, అక్టోబర్ 13: నామినేటెడ్ పోస్టుల భర్తీపై త్వరలోనే పార్టీ తుది నిర్ణయం తీసుకోనుందని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావు వెల్లడించారు. గురువారం ఇక్కడ మాట్లాడుతూ కార్పొరేషన్లు, ఫెడరేషన్ల పదవులకు ఇప్పటికే నియామకాలు పూర్తిచేసామని, ఈరెండేళ్ల కాలంలో భర్తీచేసిన సంస్థల పాలకవర్గాల గడువు ముగిసిన వాటి స్థానే కొత్తకమిటీల ఎంపిక, గ్రంథాలయ సంస్థల పదవుల భర్తీ వంటివి ఉన్నాయని వివరించారు. ఈనెల 18న అమరావతిలో పార్టీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో జరిగే భేటీలో కసరత్తు పూర్తిచేసి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. నామినేటెడ్ పదవుల భర్తీలో జాప్యం లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.