ఆంధ్రప్రదేశ్‌

పులివెందులకు తెలుగు గంగ నీళ్లిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 13: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భారీ నీటిపారుదల ప్రాజెక్టులన్నింటినీ దశలవారీగా పూర్తి చేస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వెల్లడించారు. గురువారం ఇక్కడి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ తెలుగుగంగ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేసి పులివెందుల, లింగాలకు నీరందించటమే తమ ప్రధాన కర్తవ్యమని చెప్పారు. వంశధార, నాగావళి అనుసంధానంతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను సస్యశ్యామలం చేస్తామన్నారు. ఇందుకోసం రూ.వెయ్యి కోట్లతో వంశధార ఫేజ్-1, ఫేజ్-2 పనులను 2017 నాటికి పూర్తిచేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని ప్రధాన జలాశయాలు, రిజర్వాయర్లలో ఎంతమేరకు నీటి లభ్యత ఉందో జియో ట్యాగింగ్ చేసి ఆన్‌లైన్‌లో పొందుపరిచి కోర్ డ్యాష్‌బోర్డు ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందుబాటులో ఉంచుతామన్నారు. రాష్టవ్య్రాప్తంగా 15 లక్షల బోర్లకు గాను 14 లక్షల బోర్లకు జియో ట్యాగింగ్ చేసినట్లు వివరించారు. రాయలసీమలో వేరుసెనగ పంటను రెయిన్ గన్ల ద్వారా కాపాడిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమంగా సంపాదించిన రూ. లక్ష కోట్లలో 10వేల కోట్లు నల్లధనాన్ని మార్చేందుకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రయత్నించారని మంత్రి ఉమ ఆరోపించారు. నల్లధనం ఎవరిదని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నిస్తే వ్యక్తుల పేర్లను బయటపెట్టవద్దని వైసిపి నాయకులు కేంద్రాన్ని వేడుకుంటున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష నేతగా జగన్ అనర్హుడని ధ్వజమెత్తారు.