ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్భ్రావృద్ధి రొట్టెను స్వీకరించిన ముఖ్యమంత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, అక్టోబర్ 13: నెల్లూరు నగరంలో జరుగుతున్న రొట్టెల పండగకు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్భ్రావృద్ధి రొట్టెను మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి నుంచి స్వీకరించారు. నెల్లూరు సర్ణాల చెరువులో జరుగుతున్న రొట్టెల పండగలో రెండోరోజు గురువారం రొట్టెల పండగకు హాజరైన ఆయన రొట్టెను స్వీకరించిన సందర్భంగా మాట్లాడుతూ భక్తులు తమ కోర్కెలు తీరుతాయని విశ్వసించే రొట్టెల పండగలో రాష్ట్భ్రావృద్ధి రొట్టెను స్వీకరించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని, భక్తులు కూడా అమరావతి నిర్మాణ రొట్టెను పట్టుకోవాలని పిలుపునిచ్చారు. అంతక్రితం స్థానిక బారాషాహీద్ దర్గాలో ఆయన ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. దర్గాలో భక్తులకు అందుతున్న వసతులు, ఏర్పాట్ల గురించి ఆయన ఆరా తీశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను, ప్రజాప్రతినిధులను ఆదేశించారు.

చిత్రం.. బారాషహీద్ దర్గాలో సమాధులపై చాదర్ సమర్పిస్తున్న సిఎం