ఆంధ్రప్రదేశ్‌

విశాఖలో సైకో వీరంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం(క్రైం), అక్టోబర్ 14: పూటుగా మద్యం సేవించిన ఓ సైకో నడిరోడ్డుపై కత్తులతో వీరంగం వేయడంతో ఏడుగురు తీవ్రగాయాల పాలయ్యారు. ఈ సంఘటనతో కోపోద్రిక్తులైన స్థానికులు ఎదురుదాడికి దిగడంతో ఆ సైకో మృతి చెందాడు. శుక్రవారం రాత్రి సుమారు 9.30గంటల సమయంలో బిహార్‌కు చెందినట్టుగా భావిస్తున్న ఓ వ్యక్తి కంచరపాలెం మెయిన్‌రోడ్డులో ఓ మద్యం దుకాణంలో మందు కొట్టి, రెండు చేతుల్లో కత్తులు పట్టుకుని, కంచరపాలెం మెట్టు ప్రాంతంలో రోడ్డుపై కనిపించిన వారందరిపైనా దాడి చేయడం ప్రారంభించాడు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న జనాలు పరుగులు తీయడం ప్రారంభించారు. అదే సమయంలో కొంతమంది యువకులు ధైర్యం చేసి సైకోను చుట్టుముట్టి, అతని చేతిలోని కత్తులను లాక్కొని చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని, సైకోను, అతని దాడిలో గాయాల పాలయిన ఏడుగురిని ఆసుపత్రికి తరలిస్తుండగా సైకో మార్గమధ్యంలో మృతి చెందాడు. గాయాల పాలైన ఏడుగురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.