ఆంధ్రప్రదేశ్‌

కాపులూ...కదలిరండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రత్తిపాడు, అక్టోబర్ 14: కాపులకు బిసి రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీ తీర్మానం చేసి, 9వ షెడ్యూలులో చేర్చడానికి కేంద్రానికి ప్రతిపాదన పంపిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ని నిలబెట్టుకోనందుకు నిరసనగా కాపు సత్యగ్రహ యాత్ర చేపట్టనున్నట్లు మాజీమంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. నవంబర్ 16న తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం నుండి అంతర్వేదివరకు పాదయాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. ఐదు రోజులపాటు సాగే ఈ పాదయాత్ర రావులపాలెం నుండి అమలాపురం మీదుగా అంతర్వేది వరకు వెళ్తుందన్నారు. నల్ల రిబ్బన్లు ధరించి ఈ పాదయాత్ర సాగిస్తామన్నారు. గతంలో కాపులపై లాఠీలతో రావులపాలెంలో రక్తం చిందించింద ని, అందుకే అక్కడి నుండి సత్యగ్రహ యాత్రను మొదలు పెడుతున్నట్లు తెలిపారు. కిర్లంపూడిలో తన స్వగృహంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ముద్రగడ కాపులకు ఒక లేఖను విడుదలచేశారు. బిసి రిజర్వేషన్లు సాధించే వరకు ఎవరు మద్యం ముట్టమని ప్రమాణం చేయాలని ఆయన బలిజ, తెలగ, ఒంటరి, కాపు కులస్థులను కోరారు. ప్రభుత్వం మంజునాథ్ కమిషన్ నుండి మధ్యంతర నివేదిక తెప్పించుకుని, మనలో కొంతమందికి బిసిలుగా రిజర్వేషన్లు కల్పించి, మనలో మనకి తగాదాలు పెంచేలా కుట్రలు పన్నుతున్నట్లుగా తెలిసిందని ముద్రగడ పేర్కొన్నారు. ఎవరికి ముందుగా రిజర్వేషన్ ఇచ్చినా తీసుకుందామని, అంతేతప్ప ఎవరి మోచేతి నీళ్ళు తాగవద్దని కోరారు. ఉత్తరాంధ్ర కాపులతో సైతం అందరూ సోదరులుగా ఉందామని, ముస్లింలు ఫత్వాను గౌరవించినట్లుగా మనం కూడా అలాంటి ఆలోచన చేయాలన్నారు. నిజంగా కాపులపై ప్రేమ ఉంటే ముఖ్యమంత్రిగా పీఠం ఎక్కిన వెంటనే కాపురిజర్వేషన్‌లపై చంద్రబాబు తొలి సంతకం చేసేవారన్నారు. రిజర్వేషన్లు 50శాతం దాట కూడదని మోసం చేస్తున్నారని కర్ణాటకలో 72శాతం, తమిళనాడులో 69శాతం, కేరళలో 64శాతం రిజర్వేషన్‌లు అమలవుతున్నాయని ముద్రగడ పేర్కొన్నారు.
బిసి రిజర్వేషన్ సాధన కోసం గ్రామస్థాయి నుండి జెఎసిలను నిర్మించుకుని ఉద్యమాన్ని పటిష్టం చేద్దామన్నారు. బోధించు, సమీకరించు, పోరాడు అని చెప్పిన అంబేద్కర్ మాటలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుదామన్నారు.

చిత్రం... విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతున్న ముద్రగడ