ఆంధ్రప్రదేశ్‌

వివాదాల ముసురులో ఆక్వా పార్కు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, అక్టోబర్ 15: గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్కు వ్యవహారం ముదురుతోంది. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరించడం, ఫుడ్ పార్క్ ప్రాంతంలో ఈనెల 19న పర్యటించాలని వైకాపా అధినేత వైఎస్ జగన్ నిర్ణయంచడంతో రాజకీయం వేడెక్కనుంది. వాస్తవానికి దేశంలో నాణ్యమైన ఆహార ఉత్పత్తులను ప్రజలకు అందివ్వడానికి ఫుడ్‌పార్కులను ఏర్పాటుచెయ్యాలని యుపిఎ ప్రభుత్వం అధికారంలో ఉండగా నిర్ణయం తీసుకుంది. ఆ సమయంలో ఇండోర్‌లో కూరగాయల ఫుడ్ పార్కు, భీమవరం సమీపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆనంద గ్రూప్ అనే ప్రైవేటు సంస్ధతో సంయుక్తంగా నెలకొల్పాలని నిర్ణయించారు. విశాఖపట్టణంలో కబేళా పార్కులకు అనుమతులు జారీ చేసింది. భారత దేశం నుంచి ప్రపంచంలోని యూరప్, అమెరికా వంటి దేశాలకు సముద్ర ఉత్పత్తులు ఎగుమతులు జరుగుతాయి. సముద్ర ఉత్పత్తుల్లో ఎక్కువగా అంటే సుమారు రూ.33వేల కోట్లు విలువ చేసే రొయ్యలు ఎగుమతి అవుతుంటాయి. ఈ ఎగుమతుల్లో 60 శాతం ఆంధ్రప్రదేశ్ నుంచి జరుగుతుండగా, ఒక్క పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 50 శాతం రొయ్యలు ఎగుమతి అవుతున్నాయి. డిమాండ్‌కు తగ్గట్టుగా రొయ్యలను చెరువుల్లో పెంపకం చెయ్యడం సాంప్రదాయంగా మారిపోయింది. వరి పంట వల్ల వస్తున్న నష్టాలను భరించలేక అన్నదాత రొయ్యల చెరువుల వైపు మళ్ళాడు. సుమారు 15 ఏళ్ళ క్రితం టైగర్ రొయ్య పెంపకం చేస్తున్న సమయంలో వాతావరణం వల్ల కలుగుతున్న నష్టాల వల్ల రొయ్య రైతు కోట్లాది రూపాయలను నష్టపోతున్నారు. ఆక్వా ఉత్పత్తులకు కోల్డ్ స్టోరేజ్ కావాలన్న డిమాండ్ తెరమీదకు వచ్చింది. దీని వల్ల వైరస్ బారిన రొయ్యను కొన్ని నిముషాల్లోనే బతికించుకోవచ్చు. కాగా ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువ విస్తీర్ణంలో రొయ్యలు, చేపల చెరువులు ఉండటం, ఉత్పత్తి కూడ పెరగడంతో ఈ ఆక్వా ఫుడ్ పార్కుకు గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్కుగా ఆనంద గ్రూప్ నామకరణం చేసింది. ఇటువంటి ఆక్వా ఫుడ్ పార్కులు ఇండోనేషియా, వియాత్నాం వంటి దేశాల్లో ఎక్కువగా ఉంటాయి. గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్కు కోసం భీమవరం మండలం తుందుర్రు గ్రామంలోని కొనే్నళ్ళుగా వ్యవసాయం చెయ్యలేక వదిలేసిన బీడు భూములను 72 ఎకరాలను యాజమాన్యం కొనుగోలు చేసింది. కేంద్ర ప్రభుత్వం, అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఇందులో ఎకరం 70 సెంట్లలలో కోల్డ్ స్టోరేజ్, ఐస్ బ్లాకులు, చేప, రొయ్య ప్రాసెసింగ్ చేయడం కోసం గదులను నిర్మిస్తారు. మిగిలిన భూమిలోని 55 ఎకరాల్లో గ్రీన్ బెల్డ్ అంటే వివిధ రకాల మొక్కలను పెంచడం జరుగుతోంది.రూ.101.45 కోట్లతో నిర్మించే ఈ పార్కులోని 60 టన్నుల చేపలు లేదా రొయ్యలను ప్రాసెసింగ్ చేసుకోవచ్చు, 25 టన్నుల ఐస్ బ్లాకులు, ఏడాదికి 3 వేల టన్నుల సముద్ర ఉత్పత్తులను కోల్డ్ స్టోరేజ్‌లో ఉంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి తనిఖీ చేసి అనుమతులను జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఈ పార్కుకు ఆరెంజ్ బెల్ట్ అంటే కాలుష్య రహిత పార్కుగా కూడ గుర్తింపు ఇచ్చింది.
ఇలా ఉండగా ప్రస్తుత పరిస్ధితుల్లో ప్రతీ సన్న, చిన్నకారు రైతు కనీసం రెండు నుంచి ఐదు ఎకరాల వరకు రొయ్యల సాగును ఆరంభించారు. ఆ గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్కు మంజూరుతో వారి మోములో ఆనందం వెలువిరిసింది. మరోపక్క గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క వల్ల స్ధానికుల్లో నిరశలు ప్రారంభమయ్యాయి. ఈ పార్కు వల్ల కాలుష్య సమస్యలు తలెత్తుతాయని వ్యతిరేకించడం ప్రారంభించారు. ఇందులో భాగంగా అధికారులు నిర్వహించతలపెట్టిన అభిప్రాయ సేకరణను అడ్డుకున్నారు. ప్రజల్లో తలెత్తిన ఈ వ్యతిరేకతను సిపిఎం, వైకాపా తదితర ప్రజా సంఘాలు మద్దతు పలికాయి. దీంతో ఈ వ్యవహారానికి రాజకీయ రంగు అంటుకుంది. స్ధానికుల్లో కొందరు ఆక్వా ఫుడ్ పార్కు కావాలని ఆందోళనకు దిగుతుండటంతో వ్యవహారం సంక్లిష్టంగా మారింది. స్ధానికులు వివిధ పార్టీల అండతో రకరకాలుగా అడ్డుకుంటున్నారు. ఇటీవలే వైకాపా నేతలు, మాజీ మంత్రులు పార్దసారధి, మోపిదేవి వెంకట రమణ పర్యటించారు. ఆ తదనాంతరం సీపిఎం అగ్రనేత బృందాకారత్ పర్యటించారు.