ఆంధ్రప్రదేశ్‌

అమరావతిలో 20 భారీ హోటళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 16: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఆతిథ్య రంగంలో 20 హోటళ్లను నెలకొల్పే విషయమై ఈ నెల 18వ తేదీన ఉన్నత స్థాయి అధికారుల సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. ఈ వివరాలను ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ వెల్లడించారు. అమరావతిని ఆతిథ్య రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశంలో ఆతిథ్య రంగానికి సంబంధించి విధి విధానాలను ఖరారు చేస్తారు. ఉన్నత ప్రమాణాలతో అన్ని హంగులు ఉన్న హోటళ్లను, కనె్వన్షన్ సెంటర్లను ఏర్పాటు చేస్తారు. అమరావతికి ఉన్న చారిత్రక నేపథ్యంతో దేశ, విదేశీ పర్యాటకుల తాకిడి ఎక్కువ. అలాగే ప్రపంచ స్థాయి సదస్సులు, ప్రదర్శనలు ఏర్పాటు చేసేందుకు వీలుగా ఆతిథ్య రంగాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అజయ్‌జైన్ తెలిపారు. సిఆర్‌డిఏ ఈ సదస్సును ఏర్పాటు చేస్తోంది. వివిధ దేశాల నుంచి హోటళ్ల రంగం, నిర్మాణ రంగంలోని ప్రముఖ సంస్థల ప్రతినిధులను ఈ సదస్సుకు సిఆర్‌డిఏ ఆహ్వానించింది. ఐటిసి హోటళ్లు, లీలా హోటళ్లు, మహేంద్ర రిసార్టులు, హాలిడే ఇన్, హిల్టన్ హోటళ్ల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటారు.