ఆంధ్రప్రదేశ్‌

స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తున్న చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మడకశిర, అక్టోబర్ 16: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్థానిన సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల బలోపేతానికి పలు చర్యలు చేపట్టిందని, అయితే ముఖ్యమంత్రి నేడు దానికి పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. అనంతపురం జిల్లా మడకశిరలో ఆదివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి తీరును చూస్తే స్థానిక సంస్థల పట్ల వ్యతిరేకంగా ఉన్నట్లు కనిపిస్తోందన్నారు. ప్రస్తుతం ఐదంచెలుగా ఉన్న స్థానిక సంస్థలను మూడంచెలకు కుదించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం విచారకరమన్నారు. స్థానిక సంస్థలను మరింత బలోపేతం చేయడానికి అప్పటి ప్రధానులు రాజీవ్‌గాంధీ, పివి నరసింహారావు, మన్మోహన్‌సింగ్, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఎంతో కృషి చేసి గ్రామ స్వరాజ్యం తీసుకువచ్చారన్నారు. అయితే చంద్రబాబునాయుడు మాత్రం స్థానిక సంస్థల హక్కులను కాలరాస్తున్నారన్నారు. ప్రజా ప్రతినిధులు చేయాల్సిన పనులను వారు చేయకుండా పార్టీ నాయకులకు అప్పగించి దోచుకోవడానికి కుట్ర పన్నుతున్నారన్నారు. నవంబర్‌లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించేవి జన చైతన్యయాత్రలు కావని, జన ద్రోహి యాత్రలని రఘువీరా విమర్శించారు. ప్రజలకు మంచి చేయడం కంటే ద్రోహమే ఎక్కువ జరుగుతోందన్నారు. ప్రజలు తెలుగుదేశం పట్ల వ్యతిరేకంగా ఉన్నారన్నారు. రెండున్నర సంవత్సరాల కాలంలో ప్రజలకు మంచి చేసింది ఎంత అన్న దానిపై ప్రభుత్వం వెంటనే శే్వతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు ధరలు సామాన్య, మధ్య తరగతి వారికి అందుబాటులో ఉండేలా నియంత్రిస్తామని చెప్పిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ చమురు సంస్థలతో కుమ్మక్కై అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు తగ్గుతున్నా డీజల్, పెట్రోల్ ధరలు నెలకు రెండు సార్లు పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తున్నారన్నారు. పెంచిన పెట్రోలు, డీజల్ ధరలను వెంటనే తగ్గించాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అవినీతి నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని రఘువీరారెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.