ఆంధ్రప్రదేశ్‌

క్లిష్టమైన పాస్‌వర్డ్‌తోనే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 16: ఇంటర్నెట్ వినియోగం పెరిగిన నేపథ్యంలో అంతే స్థాయిలో సైబర్ దాడులు కూడా ఎక్కువ అవుతున్నాయి. సైబర్ దాడుల్లో ప్రధానంగా ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమలు ఎక్కువగా దాడుల బారిన పడుతున్నాయి. సైబర్ దాడుల నుంచి రక్షణకు సాఫ్ట్‌వేర్ వినియోగంతో పాటు క్లిష్టమైన పాస్‌వర్డ్ ఏర్పాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. బలహీనమైన పాస్‌వర్డ్‌ల కారణంగా సోషల్ మీడియా, బ్యాంక్ ఖాతాలు హ్యాకింగ్‌కు గురవుతున్నాయి. దీనిపై వివిధ వర్గాలకు శిక్షణ ఇచ్చేందుకు వీలుగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సైబర్ సెక్యూరిటీ అండ్ డేటా అనలిటిక్స్ సెంటర్ ప్రారంభమైంది. ఇటీవల కాలంలో ఇంటర్నెట్ వినియోగం గణనీయంగా పెరిగింది. స్మార్ట్‌పోన్‌ల వినియోగంతో బ్యాంక్ ఖాతాల నిర్వహణ, బిల్లుల చెల్లింపులు, ఆన్‌లైన్ కొనుగోళ్లు చాలా పెరిగాయి. ఇంట్లో నుంచే వివిధ లావాదేవీలు నిర్వహించే వెసులుబాటు ఎక్కువ అవడంతో సైబర్ నేరగాళ్లు కూడా అదే స్థాయిలో ఎక్కువ అవుతున్నారు. పాస్‌వర్డులను తస్కరించి హ్యాకింగ్‌లకు పాల్పడుతున్నారు. బలహీనమైన పాస్‌వర్డ్‌ల కారణంగా బ్యాంక్ ఖాతాల నుంచి నిధులను మళ్లిస్తున్నారు. ఇటీవల కాలంలో జరుగుతున్న సైబర్ నేరాలను విశే్లషిస్తే... దాడుల్లో 24 శాతం ప్రభుత్వ సంస్థలపై, 20 శాతం పరిశ్రమలపై, 15 శాతం మేరకు టోరెంట్ సైట్స్, 12 శాతం వివిధ ఆర్జనైజేషన్స్‌పై, 6 శాతం మేరకు ఎడ్యుకేషన్ సైట్స్, ఇ-కామర్స్‌పై 5 శాతం, రక్షణ రంగ సంస్థలపై 3 శాతం, ఆన్‌లైన్ సేవలపై 3 శాతం మేరకు దాడులు జరుగుతున్నట్టు గుర్తించారు.
బలహీనమైన పాస్‌వర్డ్‌లే కారణం
వివిధ బ్యాంక్ ఖాతాలు, సామాజిక ఖాతాలను ఉపయోగించే వారు ఎక్కువగా బలహీనమైన పాస్‌వర్డులను వినియోగిస్తున్నట్టు అధ్యయనం తేలింది. పాస్‌వర్డ్‌లో క్లిష్టత లేకపోవడంతో పాటు తాము వాడుతున్న పాస్‌వర్డ్‌ల వివరాలు వివిధ సామాజిక మాధ్యమాల్లో వెల్లడిస్తుంటారు. ఆయా ఖాతాలపై దాడి చేసేందుకు ఈ సమాచారం హ్యాకర్లకు ఉపయోగపడుతోంది.
ఇంటర్నెట్ ద్వారా సామాజిక, ఇతర ఖాతాలను నిర్వహించే వారు పాస్‌వర్డ్‌ల రూపకల్పనలో తగిన శ్రద్ధ వహించకపోవడంతో హ్యాకర్ల పని సులువు అవుతోంది. ఈ తరహా సైబర్ దాడులను అరికట్టేందుకు ప్రజలకు అవగాహన అవసరమని ఎయు కంప్యూటర్ సైన్సు విభాగానికి చెందిన ప్రొఫెసర్, ఎయు ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఇనె్వస్టిగేటర్ వల్లీకుమారి తెలిపారు. పాస్‌వర్డ్ ఏర్పాటులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆన్‌లైన్, బ్యాంక్ ఖాతాల నిర్వహణపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివిధ వర్గాలకు ఈ కేంద్రం ద్వారా అవగాహన కల్పిస్తామన్నారు.