ఆంధ్రప్రదేశ్‌

శ్రీవారి పాదాల చెంత పోలవరం డిజైన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, అక్టోబర్ 16: రాష్ట్రప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైన స్పిల్ వే గేట్ల డిజైన్లు సిద్ధమయ్యాయని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖామంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు వెల్లడించారు. పోలవరం స్పిల్ వే గేట్ల డిజైన్లను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో వాటిని తీసుకొని మంత్రి, డిజైన్ రూపకర్త కన్నయ్యనాయుడు, ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు కలిసి శనివారం రాత్రి తిరుమల చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం ఈ డిజైన్లను స్వామివారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయం వెలుపల మంత్రి విలేఖరులతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంకల్పానికి శ్రీవారి ఆశీస్సులు తోడై ప్రాజెక్టులో అత్యంత కీలకమైన స్పిల్ వే గేట్ల డిజైన్లను 15 రోజులు వ్యవధిలో పూర్తిచేయగలిగామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును 2018 జూన్ నాటికి పూర్తిచేసి పవిత్రమైన గోదావరి తల్లి నీటిని ఆంధ్రుల గుండెల్లో నిల్వచేసుకోవాలనే కలను నెరవేరుస్తామని అన్నారు. రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తులు, దిగుబడుల రూపురేఖలను మార్చేసే పోలవరం ప్రాజెక్టు ఎంతో కీలకమన్నారు. ఈ డిజైన్లను హిడాయ్ సంస్థ సహకారంతో హైడ్రాలిక్ నిష్ణాతుడు కన్నయ్యనాయుడు, ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు పూర్తిచేశారని తెలిపారు. కన్నయ్యనాయుడుకు 400కు పైగా ప్రాజెక్టులకు పనిచేసిన అనుభవం ఉందని, ఇపుడు ఆ అనుభవమే పోలవరం ప్రాజెక్టుకు ఉన్నతమైన స్పిల్‌వే డిజైన్ రూపకల్పనలో ఉపయోగపడిందని అన్నారు. ఈ డిజైన్లను ఆమోదం కోసం కేంద్ర జల సంఘానికి పంపుతామని వివరించారు. అనంతరం ఈ డిజైన్ రూపకర్త ప్రముఖ హైడ్రాలిక్ నిష్ణాతుడు కన్నయ్యనాయుడు మాట్లాడుతూ 15 రోజుల వ్యవధిలో డిజైన్ రూపకల్పన సాధ్యమైందని అన్నారు. ఈ ప్రాజెక్టులో స్కిల్ వే నిర్మాణమే అత్యంత కీలకమైందని, అందుకే ఎన్నో జాగ్రత్తలు తీసుకొని దీనిని రూపొందించామని అన్నారు. 16 మీటర్ల ఎత్తు, 20 మీటర్ల వెడల్పు కలిగిన స్పిల్ వేకు 48 గేట్లు ఉంటాయని, ఒక్కొక్క గేటు బరువు 375 టన్నులు ఉంటుందని వివరించారు. అనంతరం ఇంజనీర్ అండ్ చీఫ్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రాజెక్టు నిర్మాణ పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్నారని, త్వరితగతిన నిర్మాణం పూర్తిచేసి రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు పెంచాలన్నదే ఆయన సంకల్పమని అన్నారు.

చిత్రం.. ఆదివారం ఉదయం శ్రీవారి పాదాల చెంత పోలవరం డిజైన్‌ను ఉంచి, ప్రత్యేక పూజలు జరిపించిన మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, డిజైన్ రూపకర్త కన్నయ్యనాయుడు, ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు