ఆంధ్రప్రదేశ్‌

పెట్టుబడుల వెల్లువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 16: రాష్ట్ర విభజనతో నవ్యాంధ్రను పునాదుల నుంచి నిర్మించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏ దేశమైనా, రాష్టమ్రైనా అభివృద్ధి పథంలో ముందుండాలంటే పారిశ్రామిక ప్రగతి తప్పనిసరి. ఈ విషయాన్ని గుర్తెరిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్భ్రావృద్ధికి ప్రత్యేక పారిశ్రామిక పాలసీని ప్రవేశపెట్టారు. సింగిల్ డెస్క్ విధానంలో 14 రోజుల్లోనే పరిశ్రమల స్థాపనకు అనుమతులిస్తున్నారు. పెట్టుబడుల కోసం దేశ, విదేశాల్లో పర్యటిస్తున్నారు. పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చే వారికి తమ ప్రభుత్వమందిస్తున్న రాయితీలను, సౌలభ్యాలను వివరిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు పెట్టుబడుదారులు క్యూ కడుతున్నారు. పరిశ్రమల స్థాపనే కాకుండా పర్యాటక రంగం, ఫుడ్ ప్రొసెసింగ్, మైన్స్, భూగర్భ గనుల తవ్వకాల్లోనూ పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో అటు పారిశ్రామిక ప్రగతితో పాటు ఉపాధి కూడా విస్తృతంగా లభ్యమవుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో రూ. 48 వేల కోట్ల విలువైన పెట్టుబడులతో పరిశ్రమలు ప్రారంభమయ్యాయి. కొన్నింటిలో ఉత్పత్తి ప్రారంభమైతే, మరికొన్నింటిలో ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. రేపో మాపో ఆ మిగిలిన పరిశ్రమల్లో ఉత్పత్తి మొదలవుతుంది. ఇవే కాక మరో రూ. 2లక్షల కోట్ల విలువైన పరిశ్రమలు ప్రారంభం కావాల్సి ఉన్నవి. వాటి తాలూక పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇప్పటికే వాటిలో కొన్నింటికి ప్రభుత్వ అనుమతులు మంజూరవ్వడంతో పాటు రాయితీలు కూడా అందజేయడం జరిగింది. ప్రారంభమైన పరిశ్రమల్లో 1.40 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి లభించింది. వివిధ దశల్లో ఉన్న పరిశ్రమల్లో ఉత్పాదన ప్రారంభమైతే, మరో 6 లక్షల మందికి ఉపాధి లభ్యమయ్యే అవకాశముంది. పారిశ్రామిక ప్రగతి కోసం ప్రభుత్వం అహర్నిశలూ కృషి చేస్తోంది. ప్రభుత్వమిస్తున్న రాయితీలతో పెట్టుబడుదారులు ఏపి వైపు చూస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న 14 రోజుల్లో పరిశ్రమల స్థాపనకు అనుమతులిస్తోంది. రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకొస్తున్న వారిలో అధిక మంది సేవల రంగం కంటే పరిశ్రమల స్థాపనపైనే పెట్టుబడిదారులు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటి వరకు జి 1 నుంచి జి 4 వరకు కేటగిరిల్లో రూ. 43.66 వేల కోట్ల పెట్టుబడులు పెట్టారు. మరో రూ. 2.85 వేల కోట్ల వరకు పెట్టుబడులు పెట్టబోతున్నారు. ఇక పర్యాటక రంగంలో ఇప్పటికే రూ.1600 కోట్లకు పైబడి పెట్టుబడులు పెట్టారు. ఇంకో రూ. 11 వేల కోట్ల మేర పెట్టుబడులకు పలువురు ఔత్సాహికులు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. అలాగే రూ. 357 కోట్ల వరకు ఫుడ్ ప్రొసెసింగ్‌లో పెట్టుబడులు తరలొచ్చాయి. మరో రూ. 270కోట్ల మేర పెట్టుబడులు రానున్నాయి. గనుల తవ్వకాలపై రూ. 10వేల కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టనున్నారు. ఇందుకోసం ఇప్పటికే పలు దరఖాస్తులు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. ఇండస్ట్రీయల్, పర్యాటక, ఫుడ్ ప్రొసెసింగ్ రంగాల్లో ఔత్సాహికులు పెట్టుబడులు పెడుతుండడంతో ఉపాధి అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ప్రారంభమైన పరిశ్రమలతో 1.40 లక్షల మంది ప్రత్యక్షంగా ఉపాధి పొందారు. ఎఫ్ 1, ఎఫ్ 2, ఎఫ్ 3, ఎఫ్ 4 కేటగిరిల్లో పరిశ్రమలు కూడా ప్రారంభమైతే మరో ఆరు లక్షల మందికి పైగా ఉద్యోగావకాశాలు లభ్యమవ్వనున్నాయి. ఇలా పరిశ్రమలన్నీ ఉత్పాదన ప్రారంభిస్తే, 8 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి లభ్యమవుతుంది. పరోక్షంగా అంతకు రెట్టింపు మందికి ఉపాధి లభ్యమయ్యే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2029 నాటికి దేశంలో రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలపడానికి సిఎం చంద్రబాబు చేస్తున్న కృషి సత్ఫలితాలిస్తున్నాయి. సన్ రైజ్ ఏపిలో భాగంగా ప్రభుత్వమందిస్తున్న ప్రోత్సాహకాలు రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి స్వర్గ్ధామంగా మారిందనడంలో సందేహం లేదు.