ఆంధ్రప్రదేశ్‌

రాడికల్ నేత వర్ధనరావు హఠాన్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెనాలి, అక్టోబర్ 16: రాడికల్ యువజన సంఘం రాష్ట్ర తొలి అధ్యక్షుడు, విరసం మాజీ సభ్యుడు విజె వర్ధనరావు (70) గుంటూరు జిల్లా తెనాలిలోని తన నివాసంలో శనివారం అర్ధరాత్రి హఠాన్మరణం చెందారు. విఎస్‌ఆర్ అండ్ ఎన్‌విఆర్ కళాశాల అధ్యాపకునిగా ఆయన పనిచేశారు. మరోవైపు విప్లవోద్యమంలో ఎందరో యువకులను రాజకీయ శిక్షణ తరగతుల ద్వారా ఉద్యమ పథాన నడిపించారు. అనేక సార్లు అరెస్ట్‌లు, వేధింపులతో జైలు జీవితం గడిపారు. కారంచేడు, చుండూరు సంఘటనల్లో దళితులకు అండగా నిలిచారు. దళిత ఫాంథర్స్, శారదాసాహిత్య వేదిక అధ్యక్షునిగా పనిచేసిన వర్ధనరావు విప్లవోద్యమంలో మాస్టారుగా సుపరిచితులు. ఆయన అంత్యక్రియలు సోమవారం ఉదయం తెనాలి ఐటా నగర్ శ్మశానవాటికలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.