ఆంధ్రప్రదేశ్‌

ఎయిర్‌పోర్ట్ విస్తరణకు రూ. 24కోట్లు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 16: గన్నవరం విమానాశ్రయం విస్తరణలో భాగంగా నాలుగు గ్రామాల్లో భూసేకరణ నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.24 కోట్లను విడుదల చేసింది. ఈ మేరకు జీవో జారీ చేసింది. అజ్జంపూడి, అల్లాపురం, బుద్ధవరం, కీసరపల్లి గ్రామాల్లో రైతుల పౌల్ట్రీ షెడ్లు, నిర్మాణాలు, చెట్లు, డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థ, కొన్ని భూములు సేకరించాలని ఇంధన, వౌలిక సదుపాయాల శాఖ నిర్ణయించింది. ఇక్కడ కూడా భూ సమీకరణ విధానాన్ని అవలంబిస్తున్నారు.
మొత్తం 494 కుటుంబాలకు పరిహారాన్ని చెల్లించనున్నారు. బుద్ధవరంలో 334 కుటుంబాలకు, అజ్జంపూడిలో 115 కుటుంబాలకు, కీసరపల్లిలో 32 కుటుంబాలకు, అల్లాపురంలో 13 కుటుంబాలకు ఈ సొమ్మును చెల్లిస్తారు. మున్సిపల్ శాఖ గన్నవరం విమానాశ్రయాన్ని విస్తరించేందుకు గత ఏడాది ఆగస్టు 27వ తేదీన జీవో జారీ చేసింది. ఈ గ్రామాల్లో దాదాపు 1229 ఎకరాలు విమానాశ్రయం విస్తరణకు అవసరమని పౌర విమానయాన శాఖ ఇప్పటికే నివేదిక ఇచ్చింది.