ఆంధ్రప్రదేశ్‌

ఘనంగా ముగిసిన రొట్టెల పండగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, అక్టోబర్ 16: మతాలకు, ప్రాంతాలకు అతీతంగా నెల్లూరులోని బారాషహీద్ దర్గాలో జరుగుతున్న రొట్టెల పండగ ఆదివారంతో ముగిసింది. ఈనెల 12న ప్రారంభమైన ఈ వేడుక ఐదు రోజుల పాటు సాగింది. చివరిరోజైన ఆదివారం కూడా యాత్రికులు అధిక సంఖ్యలో పాల్గొని స్వర్ణాల చెరువులో రొట్టెలు మార్పిడి చేసుకున్నారు.
దాదాపు 7 లక్షలకు పైగా భక్తులు ఈ పండగకు హాజరైనట్లు అధికారులు అంచనా వేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ప్రతిపక్ష నేత జగన్మోహన్‌రెడ్డి, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు ఈ పండగకు హాజరయ్యారు. ఈ పండగకు రాష్ట్ర పండగగా ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో దర్గా చుట్టుపక్కల, రొట్టెల మార్పిడి జరిగే చెరువు సమీపంలో కోట్ల రూపాయల నిధులతో ప్రభుత్వం పలు అభివృద్ధి పనులు, ఘాట్లను ఏర్పాటు చేసింది. పండగకు హాజరైన ఇతర ప్రాంతాలకు చెందిన యాత్రికులు ఈ ఏడాది చేసిన ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆదివారం జరిగిన ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పొంగూరు నారాయణ, కొల్లు రవీంద్ర హాజరై పండగ విజయవంతానికి కృషి చేసిన అధికారులకు, దర్గా కమిటీ సభ్యులకు, వాలంటీర్లకు సత్కారం చేశారు.

చిత్రం.. నెల్లూరు స్వర్ణాల చెరువు వద్ద భక్తుల రద్దీ