ఆంధ్రప్రదేశ్‌

స్వర్ణ కవచంతో దుర్గమ్మ దివ్యదర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఇంద్రకీలాద్రి), అక్టోబర్ 16: పౌర్ణమి సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీకనకదుర్గమ్మ శ్రీ స్వర్ణకవచాలంకృత అలంకారంతో భక్తులకు దివ్యదర్శనం మిచ్చింది. దసరా మహోత్సవాలు ముందు ఒక దాత సుమారు 4 కోట్ల 50 లక్షల ఖర్చుతో అమ్మవారికి పసిడి కవచం, పసిడి ఆభరణాలు తదితరాలు అమ్మవారికి సమర్పించారు. పౌర్ణమి సందర్భంగా దాత ఇచ్చిన ఆభరణాలను అమ్మవారికి అలకరించారు. ఆదివారం, పౌర్ణమి, స్వర్ణకవచాలంకృత అలంకారంతో అమ్మ దర్శనం ఇస్తుండడంతో దుర్గమ్మను దర్శించుకోవటానికి ఆదివారం భక్తులు ఇంద్రకీలాద్రికి బారులుతీరారు. దసరా మహోత్సవాల తరహాలో భక్తులు అధిక సంఖ్యలో తరలి రావటంతో రూ. 300 టిక్కెట్ కొనుగోలు చేసిన భక్తులను సైతం కేవలం ముఖమంటప దర్శనానికే పరిమితం చేశారు. క్యూ మార్గంలో అమ్మవారిని దర్శించుకోడానికి భక్తులకు మూడు గంటలు పైగానే పట్టింది. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అమ్మవారి సన్నిధిలో విపరీతమైన భక్తుల రద్దీ కనబడింది.

చిత్రం.. భక్తులతో పోటెత్తిన ఇంద్రకీలాద్రి