ఆంధ్రప్రదేశ్‌

బిసిలు ఐక్యంగా ఉండాలి: కృష్ణయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, అక్టోబర్ 17: బిసిల అభివృద్ధిని అగ్రవర్ణాలు అడ్డుకుంటున్నాయని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. సోమవారం అనంతపురం నగరంలోని కెఎస్‌ఆర్ జూనియర్ కళాశాల ఆడిటోరియంలో బిసి సంక్షేమ సంఘం రాయలసీమ అధ్యక్షుడు రమేష్‌గౌడ్ ఆధ్వర్యంలో రిజర్వేషన్ల పరిరక్షణపై జరిగిన సదస్సులో కృష్ణయ్య మాట్లాడుతూ అగ్రవర్ణాల వారు ఎన్నికల సమయంలో చెప్పే మాయమాటలు, డబ్బుకు ఓటును అమ్ముకోవద్దన్నారు. ఓటుహక్కు అనేది ప్రధాని, ముఖ్యమంత్రి పదవితో సమానమన్నారు. దాన్ని వినియోగించేటప్పుడు ప్రతి ఒక్క బిసి బిసి కులాల్లోని వారికే వేయాలని పిలుపునిచ్చారు. బిసి కులాలు ఐక్యంగా రాజ్యాధికారం కోసం ఏకం కావాలని పిలుపునిచ్చారు. కాపులను బిసి జాబితాలో చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించడం సరైన చర్య కాదన్నారు. వాల్మీకులు, బెస్తలను ఎస్టీ జాబితాలో చేర్చుతామని, బిసిలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్న టిడిపి ప్రభుత్వం వాటిని మొదట అమలుచేయాలని డిమాండ్ చేశారు. అలాగే పార్లమెంటు, అసెంబ్లీలోకి ఇప్పటివరకు ప్రవేశించని కులాలవారిని నామినేటెడ్ చేయాలన్నారు. 1970, 80, 85, 93లో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం వేసిన కమిషన్లను హైకోర్టు వ్యతిరేకించిందని ఆయన గుర్తుచేశారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు లేకపోతే బిసిలకు అన్యాయం జరుగుతుందన్నారు. రిజర్వేషన్లు కల్పించడంలో రాజ్యాంగ, న్యాయపరమైన అంశాలను పరిగణలోకి తీసుకోవాలని ఆయన సూచించారు.