ఆంధ్రప్రదేశ్‌

మంజునాథ్ ఎదుట బాహాబాహీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, అక్టోబర్ 17: అనంతపురం నగరంలో సోమవారం బిసి కమిషన్ పర్యటనలో రసాభాస చోటుచేసుకుంది. కాపులను బిసి జాబితాలో చేర్చవద్దంటూ బిసి సంఘాల నాయకులు కమిషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. గట్టిగా కేకలు వేస్తూ బిసి కమిషన్ గో బ్యాక్ అంటూ నినాదాల చేశారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం జిల్లాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం బిసి కమిషన్ సభ్యులు వచ్చారు. మొదటి రోజు నగరంలోని లలితకళాపరిషత్‌లో బిసి కమిషన్ చైర్మన్ జస్టిస్ కెఎల్.మంజునాథ్ అధ్యక్షతన, సభ్యులు ఆచార్య వెంకటేశ్వర సుబ్రహ్మణ్యం, ఆచార్య మల్లెపూర్ణచంద్రరావు, ఆచార్య శ్రీమంతుల సత్యనారాయణ, సభ్య కార్యదర్శి ఏ.కృష్ణమోహన్ బహిరంగ విచారణ నిర్వహించారు. బిసిల్లో కులం చేర్పులు, మార్పులపై వినతులు స్వీకరించింది. ఈ క్రమంలో కాపులు, బిసి సంఘాల నేతల వాదనలను కమిటీ సభ్యులు సానుకూలంగా విన్నారు. జిల్లా బలిజ, కాపు సంక్షేమ సంఘాల నాయకులు కొందరు తమను బిసిల్లో చేర్చాలంటూ కారణాలు వివరిస్తూ కమిషన్‌కు విన్నవించారు. అక్కడే ఉన్న బిసి సంక్షేమ సంఘాలు, బిసి ఉద్యోగులు, యువజన సంఘాల నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఆర్థికంగా, రాజకీయంగా బలోపేతంగా ఉన్న కాపులను బిసిల్లో చేర్చడం వల్ల తమకు తీవ్ర నష్టం జరుగుతుందంటూ ఆందోళనకు దిగారు. ఒక దశలో కాపు, బిసి సంఘాల నాయకులు పరస్పరం వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు ఇరువర్గాలకు సర్దిచెప్పి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ సందర్భంగా బిసి కమిషన్ చైర్మన్ జస్టిస్ కెఎల్.మంజునాథ్ మాట్లాడుతూ బిసి కులాల జాబితాలో మార్పులు, చేర్పులపై వచ్చిన విజ్ఞప్తులను శాస్ర్తియంగా అధ్యయనం చేసి నిష్పక్షపాతంగా ప్రభుత్వానికి నివేదిక అందిస్తామన్నారు. అన్ని వర్గాల వారు తమ విజ్ఞప్తులు అందచేయవచ్చన్నారు. అందరికీ అవకాశం కల్పిస్తామన్నారు.

చిత్రం.. అనంతపురం నగరంలో బిసి కమిషన్ ఎదుట ఆందోళనకు దిగిన బిసి సంఘాల నాయకులు. సర్దిచెబుతున్న కమిషన్ చైర్మన్ జస్టిస్ కెఎల్.మంజునాథ్