ఆంధ్రప్రదేశ్‌

నవంబర్‌లో కాంక్రీటు పనులు ప్రారంభమవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలవరం, అక్టోబర్ 17: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కాంక్రీటు పనులను నవంబర్ నెలలో ప్రారంభించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జల వనరుల శాఖ అధికారులు, కాంట్రాక్టు ఏజన్సీల ప్రతినిధులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై సోమవారం ప్రాజెక్టు క్యాంపు కార్యాలయంలో జరిపిన సమీక్షలో ఆయన ఈ ఆదేశాలు జారీచేశారు. 2018 నాటికి కుడి, ఎడమ కాలువల ద్వారా గ్రావిటీ ద్వారా నీరు తరలించేందుకు కృతనిశ్చయంతో ఉన్నామని, ఈ దిశగా లక్ష్యాన్ని సాధించేందుకు పనులు వేగవంతం చేయాలన్నారు. వీటితోపాటు స్పిల్‌వేకు సంబంధించిన కాంక్రీటు పనులు డిసెంబర్ నెల నాటికి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే అవసరమైన మిషనరీతోపాటు అధునాతన 70 టిప్పర్లను రప్పిస్తున్నామని, అలాగే మరికొన్ని యంత్రాలను కూడా వారం రోజుల్లో ఇక్కడకు రప్పించనున్నట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మైక్రోసాఫ్ట్, ప్లానింగ్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించడం ద్వారా ప్రాజెక్టు నిర్మాణ పనులకు సంబంధించి సమగ్ర సమాచారం అందుబాటులో ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణానికి పూర్తి సహకారాన్ని అందిస్తామని ప్రకటించిందని, ఇప్పటికే వివిధ నిర్మాణ పనులకు సంబంధించిన పాలనాపరమైన పనులు, డిజైన్ల అనుమతులు మంజూరయ్యాయన్నారు. జలవనరుల శాఖ, కాంట్రాక్టు ఏజన్సీలు సమన్వయంతో పనిచేయాలని సిఎం సూచించారు. ఇందుకు సంబంధించి సంయుక్తంగా ఇరు ప్రతినిధులతో ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ యూనిట్‌ను నిర్వహించాలని సూచించారు. ప్రాజెక్టు నిర్మాణ పనులను ప్రతి రోజు డ్రోన్ కెమెరాల ద్వారా వాస్తవ పరిస్థితులను తెలుసుకుంటామన్నారు. ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో పోలీసు చెక్‌పోస్టు ఏర్పాటుచేస్తున్నామని, భారీ వాహనాలను ప్రాజెక్టుకు తరలించే సమయంలో ప్రమాదాలు, అంతరాయాలు కలగకుండా అవసరమైన పోలీసు సహాయాన్ని అందిస్తామన్నారు. ప్రాజెక్టు నిర్మాణ దృష్ట్యా పోలవరం నుండి కొవ్వూరు వరకూ ప్రక్కిలంక, గోపాలపురం, దేవరపల్లి రోడ్లను వెడల్పు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రతిపాదనలు సమర్పించాలని పశ్చిమ గోదావరి కలెక్టర్ భాస్కర్‌ను ఆదేశించారు. సమావేశంలో జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్, ఇఎంసి ఎం వెంకటేశ్వరరావు, ప్రాజెక్టు ఎస్‌ఇ ఆర్‌వి రమేష్‌బాబు, త్రివేణి ఏజన్సీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కార్తికేయన్, ట్రాన్స్‌ట్రాయ్ ఎండి చెరుకూరి శ్రీ్ధర్, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.

చిత్రం.. పోలవరం పనులను సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు