ఆంధ్రప్రదేశ్‌

పురుషోత్తంపట్నం ఎత్తిపోతల బాలారిష్టాలు దాటేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, అక్టోబర్ 18: పట్టిసం ఎత్తిపోతల తరహాలో పోలవరం ఎడమ కాలువ ఆధారంగా విశాఖ జిల్లాకు గోదావరి నీరు తరలింపునకు తూర్పు గోదావరి జిల్లా పురుషోత్తంపట్నం వద్ద నిర్మించతలపెట్టిన ఎత్తిపోతల పథకానికి ఎన్నో ఆటంకాలు కనిపిస్తున్నాయి. అఖండ గోదావరి ఎడమ గట్టుపై పుష్కర ఎత్తిపోతల పథకం చెంతనే నిర్మించనున్న ఈ ఎత్తిపోతల పథకంపై ఆరంభంలోనే ఆందోళన సెగ రాజుకుంటోంది. సుమారు రూ.1600 కోట్లకు పైగా ఖర్చయ్యే ఈ పథకానికి నిధుల సమీకరణ ఎలా జరుగుతుందనే సందేహం వ్యక్తమవుతోంది. పంపుహౌస్ నిర్మించే ప్రాంతంలో భూసేకరణ చేయాల్సి వుంది. ఆ ప్రాంతంలో వున్న ప్రజలను ఖాళీ చేయించే విషయంలో తీవ్ర వ్యతిరేకత ఎదురుకానుంది. వాస్తవానికి ఈ పథకం ఇన్‌టేక్ వెల్ పంపుహౌస్ నిర్మించే ప్రాంతం నుంచే పోలవరం ఎడమ ప్రధాన కాల్వ మొదలు కానుంది. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకంలో అఖండ గోదావరి నదిలోంచి నీటిని తోడి, కొంత దూరం ప్రెజర్ మెయిన్ ద్వారా పోలవరం కాల్వలోకి పోస్తారు. అక్కడ నుంచి గ్రావిటీ ద్వారా నీరు ప్రవహించి పోలవరం ఎడమ ప్రధాన కాల్వ 57వ కిలోమీటరు వద్ద యర్రవరం సమీపంలో జాతీయ రహదారి వద్ద ఏలేరు రిజర్వాయరుకు కలుస్తుంది. కాల్వ నుంచి రిజర్వాయరులోకి నీటిని తోడేందుకు అక్కడ కూడా లిఫ్ట్ ఏర్పాటుచేస్తారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా పోలవరం కుడి ప్రధాన కాల్వను పూర్తి స్థాయిలో ఏ విధంగా వినియోగంలోకి తెచ్చారో అదే విధంగా పురుషోత్తపట్నం ఎత్తిపోతల పధకం ద్వారా పోలవరం ఎడమ కాల్వను కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకుని ఏలేరు అనుసంధానంతో ఏలేరు ఆయకట్టు స్థిరీకరణ, గ్రేటర్ విశాఖకు పూర్తి స్థాయిలో మంచినీరు అందించాలని నిర్ణయించారు. అలాగే విశాఖ పారిశ్రామిక అవసరాలు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకంలో ముందస్తుగానే ఫలితాలు రాబట్టేందుకు ఈ పథకాన్ని వినియోగించుకోనున్నారు. ఇందు కోసం రూ. 1638 కోట్ల నిధులకు పరిపాలనా ఆమోదం తెలియజేస్తూ జీ ఓ నెంబర్ 100 ద్వారా ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ పథకాన్ని రెండు భాగాలుగా పూర్తిచేయనున్నారు. స్టేజ్-1లో గోదావరి నుంచి 1.80 కిలోమీటరు వరకు తీసుకెళ్తారు. అక్కడ నుంచి స్టేజ్-2లో ఎడమ కాల్వ 57వ కిలో మీటర్ వద్ద నుంచి ఏలేరులో అనుసంధానం చేస్తారు. గోదావరి వరద నీటిని ఇందుకు వినియోగించుకునేలా రూపొందించారు. దీంతో నిత్యం ఏలేరు రిజర్వాయర్‌లో 25 టిఎంసిల నీరువుండేలా డిజైన్ చేస్తున్నారు.