ఆంధ్రప్రదేశ్‌

ఇక డిజిటల్ పాఠాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 19: రాష్ట్రంలో 100 కోట్ల రూపాయల వ్యయంతో ఐదు వేల డిజిటల్ తరగతులు ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలియచేశారు. బుధవారం ఆయన ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ డిజిటల్ తరగతుల ఏర్పాటుకు అవసరమయ్యే నిధుల్లో 70 శాతం రాష్ట్రప్రభుత్వం భరిస్తుందని, 30 శాతం ఎన్‌ఆర్‌ఐలు విరాళంగా ఇవ్వనున్నారని చెప్పారు. విద్యాబోధనలో సాంకేతికతకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నామని ఆయన చెప్పారు. ఏపిలో చదువుకుని విదేశాల్లో స్థిరపడిన వారు ఇప్పుడు తమ జన్మభూమికి ఎంతోకొంత సేవ చేయాలన్న ఉద్దేశంతో డిజిటల్ తరగతులు ఏర్పాటులో ఆర్థికంగా భాగస్వామ్యమవుతున్నారన్నారు. రాష్టవ్య్రాప్తంగా ఐదువేల డిజిటల్ తరగతులను దశల వారీగా ఏర్పాటు చేస్తామని గంటా చెప్పారు. తొలివిడత 1280స్కూళ్లలో వీటిని ఏర్పాటు చేయనున్నామని పేర్కొన్నారు. తరువాత అన్ని స్కూళ్లకూ విస్తరిస్తామని చెప్పారు. విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకువస్తున్నామని అన్నారు. ఉత్తమ స్కూళ్లలోని ఉత్తమ ఉపాధ్యాయులను తీసుకువచ్చి, మిగిలిన స్కూళ్ల టీచర్లకు శిక్షణ ఇప్పిస్తామని గంటా చెప్పారు. అలాగే పురాతన యూనివర్శిటీలకు ఇకపై ప్రభుత్వం నిధులు ఇచ్చే అవకాశం లేదని మంత్రి గంటా స్పష్టం చేశారు. యూనివర్శిటీలో పటిష్ట విద్యనందించేందుకు 1104 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ పోస్ట్‌లను ఏపిపిఎస్‌సి నుంచి భర్తీ చేయనున్నామని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని చిన్న చిన్న యూనివర్శిటీలకు క్యాపిటల్ గ్రాంట్ కింద 300 కోట్ల రూపాయలు మంజూరు చేయనున్నామని గంటా చెప్పారు.
వచ్చే ఏడాది నుంచి అన్ని సెట్‌లకు ఆన్‌లైన్‌లోనే పరీక్షలు నిర్వహించనున్నామని మంత్రి చెప్పారు. అలాగే రాష్ట్రంలో పాఠశాలలకు అనుమతులు మంజూరు చేయడంలో ఇప్పుడున్న నిబంధనలదను సరళతరం చేయనున్నామని, సింగిల్ విండో సిస్టమ్ ద్వారా అనుమతులు ఇవ్వనున్నామని మంత్రి వివరించారు. జనవరి మూడో తేదీన తిరపతిలో ఆల్ ఇండియా సైన్స్ కాంగ్రెస్ నిర్వహించనున్నామని మంత్రి చెప్పారు. ఇందుకోసం 15 కోట్లు ఖర్చు చేస్తున్నామని, ప్రధాని మోదీ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారని ఆయన చెప్పారు.
అమెరికాలో ఎన్‌ఆర్‌ఐ అధికార ప్రతినిధి జయరాం మాట్లాడుతూ ప్రభుత్వ స్కూళ్లను కూడా ఆధునికరించాలన్న సంకల్పంతో డిజిటల్ తరగతులను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. విశాఖలో 341 డిజిటల్ తరగతులను ఏర్పాటు చేయడానికి తానా ముందుకు వచ్చిందని ఆయన చెప్పారు. ఒక్కో డిజిటల్ తరగతిని 750 డాలర్లతో ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన చెప్పారు.