ఆంధ్రప్రదేశ్‌

పాలకొల్లు క్షీరారామంలో నేటి నుంచి మహాకుంభాభిషేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాలకొల్లు, అక్టోబర్ 19: పంచారామ క్షేత్రాల్లో ఒకటైన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయంలో గురు, శుక్రవారాల్లో మహాకుంభాభిషేకం నిర్వహిస్తున్నారు. గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్, సేవ్ టెంపుల్స్ అర్గనైజేషన్ తరపున గజల్స్ శ్రీనివాస్ నేతృత్వంలో మహాకుంభాభిషేకం జరగనుంది. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి, కాకినాడ శ్రీ పీఠం అధిపతి పరిపూర్ణానంద సరస్వతి ఈ మహాక్రతువులో పాల్గొననున్నారు. కాగా మహాకుంభిషేకానికి పట్టణంలో ఉన్న 28 దేవాలయాల నుండి కలశాలతో పుణ్యజలాన్ని తరలించే కార్యక్రమం బుధవారం ప్రారంభించారు. సుమారు వెయ్యి మంది మహిళలు కలశాలతో మంగళవాయిద్యాల నడుమ ఈ పుణ్య జలాల తరలింపులో పాల్గొన్నారు. ప్రతి కలశాన్ని ఒక క్రమంలో తీసుకువచ్చి, ఆలయంలో క్షీరారామలింగేశ్వర స్వామికి చూపించి, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డ్రమ్ముల్లో ఈ జలాన్ని జాగ్రత్త చేస్తున్నారు. క్షీరారామానికే వనె్నతెచ్చే వేల సంవత్సరాల చరిత్ర కలిగిన పెద్దగోపురం రాష్టస్థ్రాయిలో ఒక ప్రత్యేక గుర్తింపు పొందింది. మహాకుంభాభిషేకానికి వీలుగా గోపురంపైకి చేరుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లుచేశారు.
గురువారం ఉదయం 7 గంటలకు ప్రదక్షిణ, 8 గంటల నుండి 12 గంటల వరకు గణపతిపూజ, యాగం తదితర కార్యక్రమాలతో మహాక్రతువు జరుగుతుంది. సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8గంటల వరకు కలశాల ఆవాహన తదితర కార్యక్రమాలు జరుగుతాయి. శుక్రవారం మహా కుంభాభిషేకం, మహాపూర్ణాహుతి తదితర కార్యక్రమాలు జరుగుతాయి. పాలకొల్లు ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు, డాక్టర్ గజల్స్ శ్రీనివాస్ బుధవారం ఉదయం ఏర్పాట్లను పర్యవేక్షించారు. భారీ ఎత్తున ప్రముఖులు, ప్రజలు తరలిరానున్నందున అవసరమైన అన్ని ఏర్పాట్లుచేయాలని ఎమ్మెల్యే అధికార్లను ఆదేశించారు. రెండు రోజులు తరలివచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లుచేస్తున్నారు. స్వామీజీలు, మంత్రులు, శాసన సభ్యులు, పార్లమెంటు సభ్యులు వివిధ పార్టీల నాయకులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వస్తున్నట్లు గజల్స్ శ్రీనివాస్ వెల్లడించారు.

మహాకుంభాభిషేకానికి సిద్ధంచేసిన కలశాలు, ఏర్పాట్ల దృశ్యం