ఆంధ్రప్రదేశ్‌

ఎపిసెట్‌లో 2,949 మందికి అర్హత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 19: వివిధ డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకులుగా, వర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫసర్లుగా నియామకానికి సంబంధించిన అర్హత పరీక్ష ఎపి స్టేట్ ఎలిజిబిలిటీ టెస్టు (ఎపిసెట్) 2016 ఫలితాలను ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఫ్లాటినం జుబ్లీ అతిథి గృహంలో బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. ఇందులో 2949 మంది అర్హత సాధించినట్లు తెలిపారు. సెప్టెంబర్ 11న రాష్ట్రంలో 100 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. 56453 మంది దరఖాస్తు చేయగా, 44576 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇందులో 6.62 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించారన్నారు. యుజిసినెట్ (4.2 శాతం), 2014లో నిర్వహించిన ఎపిసెట్ (6.02శాతం) కన్నా మెరుగైన ఫలితాన్ని సాధించినట్లు తెలిపారు. యుజిసినెట్ తరహాలో పరీక్ష నిర్వహించామని, యుజిసి మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హుల జాబితాను ఖరారు చేసినట్లు తెలిపారు. త్వరలో భర్తీ చేయనున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను దృష్టిలో ఉంచుకుని ఫలితాలను రికార్డు సమయంలో, 38 రోజుల్లో ప్రకటించామని తెలిపారు. అర్హత సాధించిన వారిలో ఒసికి సంబంధించి 921 మంది, బిసికి 1336 మంది, ఎస్సీకి 528 మంది, ఎస్టీకి 97 మంది, ఇతర కేటగిరిల్లో 67 మంది అర్హత సాధించారన్నారు. 2198 మంది మహిళలు, 751 మంది పురుషులు అర్హత సాధించారన్నారు. ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్‌ల పోస్టుల నియామకాలను ఎపిపిఎస్‌సికి అప్పగించామని, పోస్టుల భర్తీకి ఈ సంవత్సరాంతంలోగా నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎయు వీసీ ఆచార్య నాగేశ్వరరావు, రిజిస్ట్రార్ ఆచార్య ఉమా మహేశ్వరరావు, ఎపిసెట్ మెంబర్ సెక్రటరీ ఆచార్య శ్రీనివాసరావు పాల్గొన్నారు.

ఎపిసెట్ ఫలితాల సిడిని ఆవిష్కరిస్తున్న మంత్రి
గంటా శ్రీనివాసరావు, ఎయు విసి ఆచార్య నాగేశ్వరరావు