ఆంధ్రప్రదేశ్‌

ఇంటర్ ఫీజుకు గడువు నవంబర్ 1

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 19: ఆంధ్రప్రదేశ్‌లో 2017 మార్చిలో జరిగే ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి దరఖాస్తు గడువును బోర్డు కార్యదర్శి కె. సంధ్యారాణి తెలిపారు. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా నవంబర్ 1వ తేదీ వరకూ తమ పరీక్ష దరఖాస్తులను దాఖలు చేయవచ్చని బోర్డు సూచించింది. 120 రూపాయల జరిమానాతో నవంబర్ 10 వరకూ, 500 అపరాధరుసుంతో నవంబర్ 17 వరకూ, వెయ్యితో నవంబర్ 28 వరకూ, రెండు వేలతో డిసెంబర్ 21 వరకూ దరఖాస్తు దాఖలు చేయవచ్చు. 3వేల అపరాధ రుసుంతో డిసెంబర్ 31 వరకూ, ఐదువేల జరిమానాతో జనవరి 18 వరకూ దరఖాస్తులు పంపుకునే వీలుందని బోర్డు అధికారులు వివరించారు.
టిడిపిలో చేరిన ఎమ్మెల్యేలపై
అనర్హత వేటు వేయాలి
హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వైకాపా * 24న కేసు విచారణ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, అక్టోబర్ 19: వైకాపా నుండి టిడిపిలో చేరిన 16 మంది ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాలని కోరుతూ తాము ఇచ్చిన ఫిర్యాదును ఏపి శాసనసభ స్పీకర్ పరిగణనలోకి తీసుకోలేదని, స్పీకర్ చర్యను అక్రమం, రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని కోరుతూ వైకాపా హైకోర్టులో పిటిషన్ దాఖలుచేసింది. ఈ పిటిషన్‌ను వైకాపా ఎమ్మెల్యే వై విశే్వశ్వరరెడ్డి దాఖలు చేశారు. వైకాపా తరఫున ఎన్నికై టిడిపిలోకి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, జలీల్ ఖాన్, సి ఆదినారాయణ రెడ్డి, టి జయరాములు, ఆర్‌విఎస్ కృష్ణ రంగారావు, పి సునీల్ కుమార్, ఏ చాంద్‌బాషా, జ్యోతులనెహ్రూ, ఎం మణి గాంధీ, కె సర్వేశ్వరరావు, పి డేవిడ్ రాజు, బుడ్డా రాజశేఖర రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, కె వెంకటరమణ, వి సుబ్బారావు, భూమా అఖిల ప్రియ ఉన్నారన్నారు. 2014 శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో వీరంతా వైకాపా టిక్కెట్‌పై గెలిచారని, శాసనసభ్యత్వానికి రాజీనామా చేయకుండా టిడిపిలో చేరారని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఉల్లంఘించారన్నారు. పార్ట్ఫీరాయింపు నిరోధక చట్టానికి లోబడి వీరందరిపై అనర్హత వేటు వేయాల్సిన బాధ్యత స్పీకర్‌పై ఉందన్నారు.
ఈ పిటిషన్‌ను జస్టిస్ చల్లా కోదండరామ్ స్వీకరించారు. ఈ పిటిషన్‌పై స్పందించాల్సిందిగా హైకోర్టు ఏపి అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్‌ను అడిగింది. కాగా ఈ పిటిషన్ విచారణను వాయిదా వేయాలని ఆయన కోరారు. అనంతరం ఈ పిటిషన్ విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేశారు.