ఆంధ్రప్రదేశ్‌

ఎమ్మార్పీని అతిక్రమిస్తే బైండోవర్లు.. పిడి కేసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, అక్టోబర్ 20 : రాష్ట్రంలో అధిక ధరకు మద్యం విక్రయాలు జరిపితే కఠినచర్యలు తప్పమని ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఎంఅర్‌పిని తూచాతప్పకుండా అమలు చేయాలని అన్నారు. గురువారం అనంతపురంలో ఆయన ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ మద్యం విక్రయాల్లో ఎమ్మార్పీని అతిక్రమించే వారిపై విధించే అపరాధ రుసుం(కాంపౌండ్) రూ.5 లక్షలకు పెంచామన్నారు. అది అమలు కాలేదని, అవసరమైతే కాంపౌండ్ పెంచాలని యోచిస్తున్నామన్నారు. అలాగే విక్రయాల్లో మార్జిన్ తక్కువగా వస్తోందన్న ఉద్దేశంతోనే మద్యం వ్యాపారులు అక్రమాలకు పాల్పడుతున్నారని, దీని నివారణకు లైసెన్సు ఫీజు తగ్గించి, అవసరమైతే నిర్వాహకులపై భారం పడకుండా చేయాలనుకుంటున్నామన్నారు. తద్వారా సర్వీస్ ట్యాక్స్ వంటివి తగ్గుతాయన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 4,300 మద్యం దుకాణాలు, 700 దాకా బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయన్నారు. ప్రస్తుతానికి వాటిని పెంచే యోచన లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అయితే జనాభా ప్రాతిపదికన కొన్ని బార్లు పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మద్యం విక్రయాల ద్వారా రూ.3500 కోట్ల ఆదాయం వస్తోందన్నారు. శాఖాపరంగా తాము తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో రూ.4000 కోట్లకు పెరిగే అవకాశం ఉందని మంత్రి అన్నారు. బెల్టుషాపుల నిర్వహణపై కఠినంగా వ్యవహరిస్తున్నామని, అక్రమ మద్యం విక్రేతలపై కేసులు నమోదు చేస్తున్నామని అన్నారు. జిల్లా స్థాయిలో ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాలు బాగా పనిచేస్తున్నాయన్నారు. ఒక్కో జిల్లాలో 30 నుంచి 40 దాకా కేసులు నమోదువుతున్నాయన్నారు. ఆర్గనైజ్డ్‌గా నిర్వహించే బెల్టుషాపులు లేవని, కొందరు నాలుగైదు బాటిళ్లు తీసుకెళ్లి అమ్ముకుంటున్నారని అన్నారు. నవోదయం కార్యక్రమంలో బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నామని, ఈ కార్యక్రమం రాష్ట్రంలో సక్సెస్ అయిందని, ఆబ్కారీ ఆదాయం కూడా పెరిగిందని అన్నారు. కాగా అక్రమ విక్రయాలు తిరిగి కొనసాగించే వారిపై పిడి యాక్టు కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పేదలు మద్యం అక్రమ విక్రయాల వైపు రాకుండా ఉండేందుకు బిసి, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలను సకాలంలో, సక్రమంగా అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అవసరమైతే రుణాల సంఖ్య పెంచాలని కూడా ప్రభుత్వానికి నివేదించామని అన్నారు.