ఆంధ్రప్రదేశ్‌

వెంటిలేటర్ల కొరతపై నివేదిక ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 20: తిరుపతిలోని స్విమ్స్ వైద్యకళాశాలలో వెంటిలేటర్ల కొరతపై నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ఏపి వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి, చిత్తూరుజిల్లా కలెక్టర్, జిల్లా వైద్యాధికారి, స్విమ్స్ సూపరింటెండెంట్‌కు నోటీసులు ఇచ్చారు. హైకోర్టు ధర్మాసనం సుమోటోగా ఈ కేసు విచారణను చేపట్టింది. చిత్తూరుజిల్లాకుచెందిన టి నవీన్ కుమార్, ఎం పురుషోత్తంరెడ్డి స్విమ్స్‌లో వెంటిలెటర్ల కొరత ఉందని, దీని వల్ల రోగులు అవస్థలు పడుతున్నారంటూ హైకోర్టుకు రాసిన లేఖను ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. వచ్చే నెల 8వ తేదీలోగా ప్రభుత్వం అఫిడవిట్లను దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.