ఆంధ్రప్రదేశ్‌

ఇదీ! వెంకయ్య తలపాగా రహస్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 20: విశాఖ జిల్లా సబ్బవరం వద్ద నిర్మించనున్న పెట్రోలియం యూనివర్శిటీ సభకు హాజరైన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పెట్టుకున్న తలపాగా రహస్యాన్ని సభికులకు వివరించారు. వెంకయ్య నాయుడు వేదిక మీద ఆశీనులైన వెంటనే స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి అతిథులను తలపాగలు, టోపీలతో అలంకరించారు. ఇదే సమయంలో వెంకయ్య నాయుడుకు రాజస్ధానీ సంప్రదాయంతో తయారు చేసిన తలపాగా పెట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, అశోక్‌గపతిరాజు తమ తమ తలపాగలు, టోపీలు తీసి పక్కన పెట్టేశారు. వెంకయ్య నాయుడు మాత్రం తలపాగాను అలానే ఉంచుకున్నారు. కాసేపటికి ఆయన ప్రసంగించడానికి మైకు ముందుకు వచ్చారు. ముందు ఆయన తన తలపాగ తీసి సభికులకు చూపిస్తూ ఇలా అన్నారు.. ‘తను మొన్నటి వరకూ కర్నాటక నుంచి రాజ్యసభకు ఎన్నికవుతూ వచ్చారు. తొలిసారిగా రాజస్థాన్ నుంచి ఎన్నికయ్యారు. ఆ రాష్ట్రంపై ఉన్న గౌరవంగా ఈ తలపాగాను తీయకుండా ఉంచుకున్నాను’ అని చెప్పారు.