ఆంధ్రప్రదేశ్‌

ఆస్తి పోతుందని తల్లి ఘాతుకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకుమాను, అక్టోబర్ 20: ఆస్తి కోసం వత్తిడి చేశాడన్న కోపంతో కన్నకొడుకునే దారుణంగా హతమార్చిందో తల్లి. కర్కశంగా హతమార్చి, అవయవాలను సైతం వేరుచేసి, మృతదేహాన్ని కూడా గుట్టుగా మాయం చేసేందుకు యత్నించింది. గుంటూరు జిల్లా, కాకుమాను మండలం, బోడిపాలెం గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం బోడిపాలెంకు చెందిన బత్తినేని అంజనాదేవి, శంకరరావు దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. ఇద్దరు కుమార్తెల్లో ఒకరు మృతిచెందగా మరో కుమార్తె నాగలక్ష్మిని అంగలకుదురుకు చెందిన యువకుడికిచ్చి పెళ్లి చేశారు. కొడుకు కోటేశ్వరరావుకు నిడుబ్రోలుకు చెందిన శైలజ అనే యువతితో 2004లో పెళ్లయంది. కాగా కోటేశ్వరరావు, శైలజ దంపతులకు సంతానం కలగకపోగా ప్రాణాంతక వ్యాధి సోకినట్టు తెలిసింది. వైద్యం కోసం ఒకటిన్నర ఎకరం భూమిని కోటేశ్వరరావు విక్రయించి ఖర్చు చేశాడు. మిగిలిన రెండెకరాల భూమిని కూడా తనకు పంచి ఇవ్వాలని తల్లిపై ఒత్తిడి చేయసాగాడు. వ్యాధిగ్రస్తుడైన కొడుకుకు ఆస్తి పంచేందుకు సుముఖంగా లేని అంజనాదేవి పంపకం విషయాన్ని దాటవేస్తూ వచ్చింది. కోడలు శైలజ ఈ నెల 11న దసరాకు పుట్టింటికి వెళ్లడంతో పథకం ప్రకారం కన్న కొడుకును 12వ తేదీనే హతమార్చింది. అంజనాదేవి సోదరుడు గార్లపాటి నాగేశ్వరరావు, కుమార్తె నాగలక్ష్మి కూడా సహకరించారు. శవాన్ని గుట్టుచప్పుడు మాయం చేసేందుకు పథకం వేసుకున్న అంజనాదేవి తలను, ఎడమకాలిని వేరుచేసి గోతంలో చుట్టిపడేసింది. శవం వాసన రాకుండా బ్లీచింగ్ కూడా చల్లింది. మిగిలిన అవయవాలను సైతం వేరు చేసే యత్నంలో ఆమె ఉండగా పుట్టింటికి వెళ్లిన శైలజ 13న బోరుపాలెంకు వచ్చి తన భర్త ఎక్కడ అని అత్తను అడిగింది. పని వెతుక్కుంటూ బెంగుళూరు వెళ్లాడని, నెల రోజుల్లో తిరిగి వస్తాడని నచ్చచెప్పి ఇంట్లోకి కూడా రానివ్వకుండా కోడలిని బయటి నుండే పుట్టింటికి తిప్పిపంపింది. శవాన్ని గుట్టుగా తరలించేందుకు అనువుగా అవయవాలను గొడ్డలితో నరికి వేరు చేసే యత్నంలో ఆమె ఉండగా వెలువడిన శబ్దానికి స్థానికులు ఆమె చేష్టలను అనుమానించి నిలదీశారు. కంగారు పడ్డ ఆమె తప్పించుకునేందుకు యత్నించగా స్థానికులు పట్టుకుని పోలీసులకు సమాచారం అందించి రంగంలోకి దింపారు. పోలీసుల రాకను పసిగట్టిన మృతుడు మేనమామ నాగేశ్వరరావు పరారు కాగా, హంతకురాలు అంజనాదేవితో పాటు ఆమె కుమార్తె నాగలక్ష్మిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.