ఆంధ్రప్రదేశ్‌

సిపిఎం నేతలపై పోలీసులు దౌర్జన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కదిరి, అక్టోబర్ 20: అనంతపురం జిల్లా నంబులపూలకుంటలో సోలార్ హబ్‌కు భూములు కోల్పోయి పరిహారం అందని రైతులను పరామర్శించడానికి గురువారం వచ్చిన సిపిఎం నాయకులను పోలీసులు అడ్డుకుని దౌర్జన్యం చేశారు. సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బి.వి రాఘవులు, జిల్లా నాయకులు సోలార్ ప్లాంట్‌ను పరిశీలించేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, సిపిఎం నాయకుల మధ్య తోపులాట జరిగింది. రెచ్చిపోయిన పోలీసులు దాడిచేయడంతో సిపిఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ తీవ్రంగా గాయపడ్డారు. తోపులాటలో సిపిఎం కార్యవర్గ సభ్యులు రామక్రిష్ణ కాలు విరిగింది. దీంతో ఆగ్రహించిన సిపిఎం నాయకులు దాదాపు రెండు గంటలపాటు స్టేషన్ బయటే బైఠాయించి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కదిరి ఆర్డీఓ వెంకటేసు, కదిరి డిఎస్పీ వెంకటరామాంజినేయులు రాఘవులుతో చర్చించారు. అంతకుముందు ఎన్‌పి.కుంట మండల కేంద్రంలో పరిహారం అందని రైతులతో రాఘవులు ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ పైసా కూడా ఇవ్వకుండా భూములను ప్రభుత్వం తీసుకుందని వాపోయారు. ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదని, ఉన్న భూములు కోల్పోయి తాము బజారున పడ్డామన్నారు. ప్రభుత్వం నుండి పరిహారం అందేలా చూడాలని రైతులు కోరారు. రాఘవులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల పేరుతో రైతుల నుండి భూములు తీసుకొని వారికి పరిహారం ఇవ్వకపోగా ఉపాధి కూడా కల్పించలేదన్నారు. అమరావతికి భూములు కోల్పోయిన రైతులకు ఎకరాకు వెయ్యి గజాల స్థలం పరిహారం ఇచ్చారన్నారు. పట్టిసీమ కాలువకు భూములు కోల్పోయిన రైతులకు ఎకరాకు రూ. 48 లక్షలు చెల్లించారని, అదే కరవు జిల్లా అయిన అనంతపురంలో ఎకరాకు రూ. లక్ష కూడా ఇవ్వడం లేదన్నారు. ముఖ్యమంత్రి ఇంటిముందు ధర్నా చేపట్టి ఎన్.పికుంట సోలార్ పనులను అడ్డుకుంటామని హెచ్చరించారు.

చిత్రం..అనంతపురం జిల్లా ఎన్‌పి.కుంట పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేస్తున్న సిపిఎం నాయకులు రాఘవులు తదితరులు