ఆంధ్రప్రదేశ్‌

సిఎం గారూ.. లంచాలడుగుతున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 20: లంచాలు ఎక్కువగా తీసుకుంటున్నారని విశాఖకు చెందిన ఒక పాఠశాల విద్యార్థిని ఆరోపించారు. విశాఖ ఎయులో డిజిటల్ క్లాస్ రూంల ప్రారంభోత్సవం అనంతరం ఆయన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని విద్యార్థులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్కైప్ ద్వారా మాట్లాడారు. విశాఖకు చెందిన కొంతమంది విద్యార్థులతో మాట్లాడించారు. ఈ సందర్భంగా ఒక విద్యార్థిని లంచాలు ఎక్కువగా తీసుకుంటున్నారని, ఇక్కడ కూడా కొంతమంది ఉన్నారని అనడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా అక్కడ ఉన్న వారు కంగుతిన్నారు. లంచాల కారణంగా కొంతమంది ఉన్నత విద్య చదవలేని పరిస్థితి ఏర్పడుతోందని, కొత్తగా కళాశాలలు ఏర్పాటు చేయలేని స్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. మరో విద్యార్థి మాట్లాడిన అనంతరం సిఎం దీనిపై వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. టెక్నాలజీని ఉపయోగించుకుని రియల్ టైమ్‌లో పర్యవేక్షిస్తున్నామని, సాంకేతిక పరిజ్ఞానంలో అవినీతిని పూర్తిగా అడ్డుకట్టవేయవచ్చన్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులకే చేరేలా న్యాయం చేయవచ్చన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు గతంలో తరగతులకు రాకపోయినా తెలిసేది కాదని, కానీ బయోమెట్రిక్ అటెండెన్సును ప్రవేశపెట్టడం ద్వారా ఆ అవకాశం లేకుండా చేశామన్నారు. సాంకేతిక పరిజానం వినియోగించడ వల్ల జవాబుదారీతనం, శ్రద్ధ పెరిగిందని వివరించారు. ఇ-ఆఫీస్ విధానం వల్ల ఫైళ్ల పెండింగ్ లేకుండా చూస్తున్నామన్నారు. పిల్లలందరికీ శక్తివంతమైన ప్రయోజనాలు లభించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. డిజిటల్ క్లాస్ రూమ్‌ల వల్ల టీచర్ పోస్టులు పోవని, టీచర్లు ఉండాలన్నారు. టీచరు చెప్పిన దానికి అదనంగా ఈ డిజిటల్ క్లాస్ రూమ్ ఉపయోగపడుతుందన్నారు.

చిత్రం..విద్యార్థులతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి