ఆంధ్రప్రదేశ్‌

ఏడాదిలోగా 400కి.మీ కొత్త రోడ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 20: నూతన రాజధాని నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ముందంజలో ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా నాణ్యతతో కూడిన రోడ్ల నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. 2019 నాటికి 1312 కి.మీ రోడ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇప్పటికే ఉన్న సమస్యలు పరిష్కరించి రోడ్డు నిర్మాణ పనులు అధికారులు వేగవంతం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 2019 నాటికి వెయ్యి కోట్ల రూపాయలతో వెయ్యి కిలోమీటర్ల రోడ్లు నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఇప్పటి వరకు 160 కోట్ల రూపాయలతో 392 కి.మీ మీటర్ల రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు. మరో 804 కి.మీ రోడ్డు నిర్మాణం జరుగుతోంది. 500 కి.మీ రోడ్ల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. ఈ ఏడాది చివరి నాటికి మరో 505 కి.మీ రోడ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం మీద 2019 నాటికి ముందస్తు ప్రణాళిక ప్రకారం మిగిలిన రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని నిశ్చయంతో ఉంది.