ఆంధ్రప్రదేశ్‌

అసెంబ్లీ స్థానాల పెంపునకు కేంద్రం ఒకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 20: రానున్న సార్వత్రిక ఎన్నికల్లోగా రాష్ట్రంలో డీ లిమిటేషన్‌కు కేంద్రప్రభుత్వం సుముఖంగా ఉందని, నరసరావుపేట ఎంపి రాయపాటి సాంబశివరావు తెలిపారు. గురువారం గుంటూరులోని తన నివాసానికి గవర్నర్ నరసింహన్ వచ్చి వెళ్లిన అనంతరం ఎంపి రాయపాటి విలేఖర్లతో మాట్లాడారు. అసెంబ్లీ స్థానాల పెంపునకు ప్రధాని నరేంద్రమోదీ సానుకూలంగా స్పం దిం చారని, ప్రతి పార్లమెంటు సెగ్మెంట్‌కు రెండు అసెంబ్లీ స్థానాలు పెంచేందుకు అవకాశం ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై నమ్మకంతో గుంటూరు జిల్లాలో రైతులు 34 వేల ఎకరాలను ఇచ్చారని, అయితే రాజధాని వచ్చినంత మాత్రాన ప్రత్యేకంగా ఒనగూరే ప్రయోజనమేదీ లేదన్న అభిప్రాయంలో రైతాంగం ఉన్నారని చెప్పారు. సచివాలయం ఏర్పడినంత మాత్రాన కేవలం హైదరాబాద్ నుంచి ఉద్యోగులు ఇక్కడకు తరలివస్తారని అదనంగా పోస్టులేవీ రావని తెలిపారు.