ఆంధ్రప్రదేశ్‌

సీమలో పేలని బాబు రెయన్‌గన్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 22: రెయిన్‌గన్ల ద్వారా అనంతపురం జిల్లాలో కరవును పారద్రోలామని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు అనంతపురంలోని అన్ని మండలాలనూ కరవు ప్రాంతాలుగా ప్రకటించడాన్ని చూస్తే ఏ మేరకు కరవును జయించారో అర్థమవుతుందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఎద్దేవాచేశారు. ఇప్పటికైనా కళ్లుతెరిచి కరవు ప్రాంతాలుగా ప్రకటించిన మండల రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. శనివారం గుంటూరులోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో బొత్స మాట్లాడుతూ ప్రభుత్వ యంత్రాంగమంతా అనంతపురానికి వెళ్లి నాలుగు రోజుల్లో రెయిన్‌గన్‌ల ద్వారా లక్షలాది ఎకరాల్లో కరవును పారదోలామని ఇబ్బడి ముబ్బడిగా ప్రెస్‌మీట్‌లు పెట్టిమరీ ఊదరగొట్టారని దుయ్యబట్టారు. వ్యవసాయశాఖ మంత్రి సొంత జిల్లాలో నకిలీ విత్తనాలు రాజ్యమేలుతుంటే కళ్లుండి కబోదిలా వ్యవహరించారే తప్ప వాటిని నియంత్రించ లేకపోయారని విమర్శించారు. ఆనాడు మిర్చి విత్తనాలు కేజీ లక్ష రూపాయల చొప్పున రైతులు కొనుగోలు చేస్తున్నా బ్లాక్ మార్కెట్‌ను అడ్డుకోలేక చేతులెత్తేయడంతో ఇప్పుడు రైతులు అన్నివిధాలా ఆర్థికంగా నష్టపోయారన్నారు. క్యాబినెట్ మీటింగ్‌లో స్వయాన సిఎం చంద్రబాబు నకిలీ విత్తన కంపెనీలపై పిడి యాక్ట్ నమోదు చేస్తామని, కఠిన చర్యలు తీసుకుంటామని, రైతులను ఆదుకుంటామని ప్రగల్భాలు పలికారని, ఎంతమందిపై చట్టాన్ని ప్రయోగించారో చెప్పాలని డిమాండ్ చేశారు. భారీవర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించడంలోనూ ప్రభుత్వం పక్షపాత ధోరణి అవలంబిస్తోందని ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లాలో నష్టపోయిన ప్రతి 10 మంది రైతుల్లో ఇద్దరికి మాత్రమే సాయం అందిందని, ఆ ఇద్దరూ పచ్చచొక్కా వారేనని దుయ్యబట్టారు. విలేఖర్ల సమావేశంలో రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.