ఆంధ్రప్రదేశ్‌

నూతన సాంకేతిక పరిజ్ఞానంతో మోడల్ పోలీస్ స్టేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉండి, అక్టోబర్ 23: రాష్ట్రంలో నూతన సాంకేతిక పరిజ్ఞానంతో మోడల్ పొలీస్ స్టేషన్లు నిర్మిస్తున్నట్టు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోమంత్రి నిమ్మకాయల చినరాజప్ప వెల్లడించారు. ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా ఉండిలో ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఒక్కొక్క స్టేషన్ నిర్మాణానికి రూ.2 నుండి మూడు కోట్లు ఖర్చు చేయనున్నట్టు చెప్పారు. అవసరమైన మేరకు నిధులు లభ్యతను బట్టి అధిక సంఖ్యలోనే నిర్మాణాలు చేపబడతామని వివరించారు. పోలీసు బదిలీలపై మాట్లాడుతూ అధికారులైనా, కిందిస్థాయి సిబ్బంది అయినా అన్ని ప్రాంతాల్లో విధులు నిర్వహించాలని, ఒకే ప్రాంతానికి పరిమితం కారాదన్నారు. సిసి కెమెరాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తరువాత నేరాలు అదుపు చేయగల్గుతున్నామన్నారు. చోరీలలో యాభై శాతం రికవరీలు చేస్తున్నామన్నారు. త్వరలో పోలీసు శాఖలో సిబ్బంది నియామకం జరుగుతుందని వెల్లడించారు. సమావేశంలో ఉండి ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు, ఎమ్మెల్యే ఆనందరావు, తదితరులు పాల్గొన్నారు.