ఆంధ్రప్రదేశ్‌

రైతులకు రూ. 10కే భోజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, అక్టోబర్ 24 : రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మార్కెట్ యార్డులకు వచ్చే రైతులకు రూ. 10కే కడుపు నిండా భోజనం పెట్టే కార్యక్రమం తొలిసారిగా కర్నూలులో సోమవారం ప్రారంభమైంది. కర్నూలుతో పాటు ఆదోని, నంద్యాల మార్కెట్ యార్డులలో భోజన వసతి కల్పించడానికి రంగం సిద్ధమైంది. రైతులకు అందించే భోజనం ఖర్చులో మార్కెట్ యార్డు రూ. 15, ఆధ్యాత్మిక సంస్థ ఇస్కాన్ రూ. 11, రైతు రూ. 10 భరించనున్నారు. అన్నం, పప్పు, మూడు రకాల కూరలు, అప్పడం, పెరుగుతో రైతుకు కడుపునిండా భోజనం పెడతామని ఇస్కాన్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి మాట్లాడుతూ రైతులకు ఎంత చేసినా తక్కువే అన్నారు. వారు పండించిన పంటలను విక్రయించడానికి మార్కెట్ యార్డుకు వచ్చి ఆకలితోనే గడుపుతున్నారని ఆవేదన చెందారు. బయట భోజనం చేయాలని కోరిక ఉన్నా అక్కడి ధరలను చూసి నీరు తాగి కాలం గడిపిన రైతులు చాలా మంది ఉన్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మార్కెట్ యార్డుల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయన్నారు. ఆదోని, నంద్యాలలో మరో వారంలో ప్రారంభించి ఒకటి, రెండు నెలల్లో రాష్ట్రంలోని అన్ని ప్రముఖ మార్కెట్ యార్డుల్లో తక్కువ ధరకు భోజన సదుపాయం కల్పిస్తామన్నారు.