ఆంధ్రప్రదేశ్‌

ఇంత జాప్యమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 24: పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులు అనుకున్నంత వేగంగా సాగకపోవడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్మాణ సంస్థలపై ఆగ్రహం వ్యక్తపర్చారు. ప్రతివారం సమీక్షిస్తున్నా పనుల్లో ఆశించిన స్థాయిలో పురోగతి లేదని అసహనం వ్యక్తం చేశారు. నిర్మాణ సంస్థల వైఫల్యం వల్లే స్పిల్‌వే, స్పిల్ చానల్, పవర్‌హౌస్ తవ్వకం పనులు ఆలస్యమయ్యాయని, ఇకపై పనులు మందకొడిగా సాగితే సహించేది లేదని హెచ్చరించారు. ఇబ్బందులు, సమస్యలుంటే అధికారులను సంప్రదించి ఎప్పటికప్పుడు పరిష్కరించకోవాల్సిందిగా నిర్మాణ సంస్థల ప్రతినిధులకు సూచించారు. రూ.110 కోట్ల పెండింగ్ బిల్లులను విడుదల చేస్తున్నట్టు చెప్పారు. పోలవరం నిర్మాణానికి నిధుల కొరత లేదని, ప్రాజెక్ట్‌కు నష్టం కలిగించేలా అలసత్వం ప్రదర్శించవద్దని హితవు పలికారు. సోమవారం విజయవాడలోని క్యాంప్ కార్యాలయం నుంచి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి వర్చువల్ ఇన్‌స్పెక్షన్ చేశారు. పనుల పురోగతి వివరాలను నిర్మాణ ప్రాంతం నుంచి వర్చువల్ ఇంటరాక్షన్ ద్వారా ముఖ్యమంత్రికి ఇంజనీరింగ్ అధికారి వెల్లడించారు. గత వారం రోజుకు 52వేల క్యూబిక్ మీటర్ల చొప్పున మట్టిని తవ్వగా, ఇకపై 75వేల క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వనున్నట్టు వివరించారు. 30 టిప్పర్లు అదనంగా సోమవారం నిర్మాణ ప్రాంతానికి చేరుకున్నాయని చెప్పిన అధికారులు మొత్తం 750 పొక్లెయిన్లతో త్వరలో తవ్వకం పనులు పెద్దఎత్తున చేపడతామన్నారు. ఈ నెల నిర్దేశించుకున్న లక్ష్యంలో స్పిల్ చానల్ తవ్వకం పనులు 381 లక్షల క్యూబిక్ మీటర్లు, స్పిల్‌వేకు సంబంధించి 25.80 లక్షల క్యూబిక్ మీటర్లు, 58.46 లక్షల క్యూబిక్ మీటర్ల మేర పవర్‌హౌస్ తవ్వకం పనులు మిగిలివున్నట్టు అధికారులు చెప్పారు. గత వారం తవ్వకం పనులు ఆలస్యం కావడానికి సరిపడా యంత్రాలు లేకపోవడంతో పాటు భూమిపొరల్లో రాతినేల తగలడం కారణమయ్యాయని ట్రాన్స్‌ట్రాయ్, త్రివేణి సంస్థల ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరణ ఇచ్చారు. పనుల పురోగతిని తనకు రోజువారీ తెలపాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి రియల్‌టైమ్‌లో ఆటంకాలను అధిగమించి ఉత్తమ పరిష్కారమార్గాల్లో ముందుకెళ్లాల్సిందిగా సూచించారు.
బ్యాక్‌లాగ్ పనులు త్వరితగతిన పూర్తిచేసేందుకు అదనపు యంత్రాలు వినియోగించాలని, అలాగే అదనపు గంటలు పనిచేయాలని స్పష్టం చేశారు. స్పిల్‌వే తవ్వకం పనులు వచ్చే ఏడాది జనవరి నాటికి, స్పిల్ చానల్ తవ్వకం పనులు వచ్చే ఏడాది మే నాటికి, పవర్‌హౌస్ పనులు వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తిచేయాలని గడువు విధించారు. ఈ ఏడాది చివరికల్లా గేట్ల డిజైన్లు రూపొందించి అనుమతులు పొందాలన్నారు. వచ్చే సమీక్షలో పనుల పురోగతని పర్యవేక్షించడంతో పాటు నిర్మాణ సంస్థలకు చెల్లింపులపై చర్చిద్దామని అధికారులకు తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్‌లో ప్రధానమైన ఎడమ ప్రధాన కాలువ పనులు శరవేగంగా సాగుతున్నాయని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. ఇప్పటికే 60 శాతం పనులు పూర్తయ్యాయని, 2018 మార్చికల్లా కాలువను సిద్ధం చేస్తామన్నారు. ఎడమ ప్రధాన కాలువ ద్వారా మొత్తం నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందించనుంది. తూర్పుగోదావరి జిల్లాలో రెండున్నర లక్షల ఎకరాలకు, విశాఖ జిల్లాలో లక్షన్నర ఎకరాలకు పూర్తిస్థాయిలో నీరు అందుతుంది. దీనిద్వారా ఇటు సాగునీరు ఇవ్వడంతో పాటు అటు విశాఖలో పరిశ్రమల అవసరాలకు నీటిని సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
సాగునీటికి 84.80 టిఎంసిలు, పరిశ్రమలలకు 23.44 టిఎంసిలు నీటిని ఎడమ ప్రధాన కాలువ నుంచి తరలించే వీలుంది. ఎడమ కాలువ కోసం 10,593 ఎకరాలు సేకరించాలని నిర్ణయించగా ఇప్పటివరకు 10,342 ఎకరాల సేకరణ పూర్తయ్యింది. ఇంకా 251 ఎకరాలను మాత్రమే సేకరించాల్సి ఉంది. వర్చువల్ ఇన్‌సెక్షన్‌లో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్, జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్, సిఎంవో ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్, ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు, ట్రాన్స్‌ట్రాయ్, త్రివేణి సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

పోలవరం, అక్టోబర్ 24: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను వర్చువల్ విధానం ద్వారా ముఖ్యమంత్రి పరిశీలించే ప్రక్రియ సోమవారం నుంచి తిరిగి ప్రారంభించారు. ఈ నెల 10న జరగవలసిన ప్రత్యక్ష పనుల పరిశీలన వాయిదా పడింది. ఈ నెల మూడవ సోమవరం (17న) సిఎం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో పర్యటించి, పనులపై సమీక్ష జరిపారు. సోమవారం పోలవరం ప్రాజెక్టు పనులను లైవ్ ద్వారా పరిశీలిస్తూ ఎస్‌ఇ విఎస్ రమేష్‌బాబుతో సమీక్షించారు. గతంలో 45వేల క్యూబిక్ మీటర్ల మట్టిపని జరగగా, ప్రస్తుతం 70వేల క్యూబిక్ మీటర్ల మట్టిపని జరుగుతున్నట్టు ఎస్‌ఇ సిఎంకు వివరించగా లక్ష్య సాధనకు ఇంకా వేగం పెంచాలని, ఇందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు తెలిసింది. ఈ కార్యక్రమం ఒక గంట పాటు కొనసాగింది. ఎస్‌ఇ రమేష్‌బాబుతో పాటు ఇఇ పుల్లారావు, కాంట్రాక్టు ఏజన్సీ ప్రతినిధి తిరుమలేశు, డిఇలు, ఎఇలు పాల్గొన్నారు.

చిత్రం... సిఎంకు పనుల ప్రగతిని పోలవరం నుంచి
వివరిస్తున్న ఎస్‌ఇ రమేష్‌బాబు