ఆంధ్రప్రదేశ్‌

తెదేపాలో ఇసుక తుపాను!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 24: అధికార తెలుగుదేశం పార్టీలో ‘ఇసుక తుపాను’ రేగుతోంది. అధికారంలోకి వచ్చాక మూడు విడతలుగా ఇసుక విధానంలో ప్రభుత్వం మార్పులు చేసింది. తొలుత ఆనవాయితీగా వస్తున్న వేలం విధానాన్ని కొనసాగించింది. అనంతరం డ్వాక్రా సంఘాలకు బాధ్యతలు అప్పగించింది. అయితే డ్వాక్రా ముసుగులో ఎమ్మెల్యేలు కొందరు మాఫియాతో చేతులు కలపడంతో పాటు అధికారులపై దాడులకు తెగబడటంతో ప్రభుత్వానికి రూ.2 వేల కోట్ల వరకూ నష్టం వచ్చిందని అంచనాలు వేశారు. మాఫియా రాజ్యమేలినా డ్వాక్రా సంఘాలకు ఇసుక రీచ్‌లు అప్పగించడం వల్ల సాలీనా రూ.850 కోట్ల మేర ఆదాయం వచ్చింది. అయితే ఉదయం 6 నుండి సాయంత్రం 6 గంటల వరకే విక్రయాలు జరపాల్సి వస్తోందని, దీనిపై మరోసారి పరిశీలన జరిపి ఏకంగా ఉచిత ఇసుక విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది. మాఫియాకు చెక్‌పెట్టే ఉద్దేశ్యంతో ఉచితంగా అందిస్తున్నా ఈ విధానం కొందరు ప్రజాప్రతినిధులకు అందివచ్చిన వరంగా మారింది. డ్వాక్రా సంఘాలు ఇసుక అమ్మకాలు జరుపుతున్న నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా తెదేపా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు కృష్ణా జిల్లా ముసునూరు తహశీల్దారు వనజాక్షిపై దాడికి దిగడం అధికార పార్టీలో ప్రకంపనలు సృష్టించింది. ఈ ఉదంతంతో పాటు రాష్టవ్య్రాప్తంగా పలువురు మంత్రులు సహా 50మందికి పైగా ఎమ్మెల్యేలకు ఇసుక అక్రమ వ్యాపారంతో సంబంధాలున్నట్లు ప్రభుత్వానికి నివేదిక అందింది. దీంతో ఉచిత ఇసుక విధానానికి శ్రీకారం చుట్టింది. ఉచిత ఇసుకను ఇతర రాష్ట్రాలకు అక్రమ రవాణా చేయటం ద్వారా కొందరు ఎమ్మెల్యేలు కోట్లకు పడగెత్తుతున్నట్లు మరోసారి ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రధానంగా కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలకు అక్రమ ఇసుక రవాణా వ్యాపారంలో భాగస్వామ్యం ఉన్నట్లు సిఎం చంద్రబాబుకు ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో కొద్దిరోజులుగా జరుగుతున్న ఆంతరంగిక సమావేశాల్లో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలను మందలించినట్లు విశ్వసనీయ సమాచారం. ‘ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని పారదర్శకంగా అమలుచేయాలని నిర్ణయించింది. సిసి కెమెరాలు ఏర్పాటు చేశాం. మాఫియాను గుర్తించేందుకు కంట్రోల్ రూములు కూడా ఉన్నాయి. ఇన్ని ఉన్నా ఏంప్రయోజనం? మీ వ్యాపారాలు మీవి. ఇలాగైతే ప్రజల్లో విశ్వసనీయత కోల్పోతాం. ఇప్పటికే మీ నిర్వాకాలకు మేం జవాబుదారీగా ఉన్నాం. ఇకపై ఇలాంటివి జరిగితే ఉపేక్షించేదిలేదు’ అంటూ ఇసుక వ్యాపారంలో పూర్తిగా మునిగిపోయిన ఐదుగురు మంత్రులు, 10మందికి పైగా ఎమ్మెల్యేలకు చంద్రబాబు సీరియస్ వార్నింగ్‌లు ఇచ్చినట్లు అధికార పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు నేతల మధ్య ఇసుక అక్రమ రవాణాలో సరిహద్దు సమస్యలు తలెత్తుతున్నట్లు వినికిడి. గుంటూరు జిల్లాలోని కృష్ణానదీ పరీవాహక ప్రాంతం నుంచి, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కేంద్రంగా పడవల ద్వారా కూడా పలుకుబడిని ఉపయోగించి పొరుగు రాష్ట్రం తెలంగాణకు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నట్లు సిఎంకి ఫిర్యాదులు అందాయి. అధికారం ముసుగులో అక్రమాలకు పాల్పడేందుకు నకిలీ ధృవీకరణ పత్రాలు సృష్టించి డిడిలు సేకరించడం, ఆపై అక్రమ రవాణాకు తెరతీస్తున్నారనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఆగ్రహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల జరిగిన పార్టీ సమావేశాల్లో ‘మీరేం చేస్తున్నారో నా వద్ద రికార్డు ఉంది. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోండి. లేకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవ’ని బాధ్యులను హెచ్చరించారు. ఉచిత ఇసుక విధానాన్ని పారదర్శకంగా అమలుచేసే బాధ్యతలను విజిలెన్స్, పోలీసు శాఖలకు అప్పగించారు. అంతేకాదు పార్టీ నేతలు, ప్రజాప్రతినిధుల ప్రమేయంపై సిఎం చంద్రబాబు స్వయంగా ఇంటిలిజెన్స్ నివేదికలు తెప్పించుకుంటున్నట్లు సమాచారం.

అనుమతుల్లేకుండా ఇసుకను లారీల్లో తరలిస్తున్న దృశ్యం (ఫైల్ ఫొటో)